ద్వాపర బలరామ ప్రతిష్ట ,శ్రీ కనకమహాలక్ష్మి ,శ్రీ గంగా
మాత సహిత సంగమ ఈశ్వరుడు గంగతో కొలువై భక్తులకు కన్నులపండుగగా దర్శనమిస్తున్నాడు .శ్రీకాకుళం జిల్లా ,వంగర మండల ,సంగా0 అగ్రహారం లో వేంచేసిన శ్రీ గౌరీ ,గంగా సహిత సంగమేశ్వరుడు ఆరునెలలు గంగమ్మతో ,ఆరు నెలలు గౌరమ్మతో ఉంటారన్నది స్థల విశిష్టత .స్వామి గంగమ్మతో దర్శనమీవడంతో భక్తులు దర్శించుకొని ,మొక్కలు చెల్లించుకుంటున్నారు .కోరిన కోర్కెలు తీర్చు కొంగు బంగారమని ,కరుణామూర్తి అని ,అపమృత్యుభయాన్ని పోగొట్టు గౌరీ నాధుడని ,దక్షిణ కాశీ నాథుడని ,భక్తుల నమ్మకం .త్రివేణిలో స్నానమాచరించి స్వామికి ఆ గంగతో అభిషేకించిన కోరు కున్న కోర్కెలు తీరునని స్థల పురాణం .ఆలయంలో వేంచేసిన సంధ్య ,ఉషా సహిత మహిమాన్విత ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుని ,వివాహం ,కుజదోష నివారణకు సుబ్రమణ్య స్వామిని ,అనుకూలతకు శక్తి స్వరూపిణి దుర్గా మాతను భక్తులు కొలుచుకుంటారు .
ద్వాపర ,బలరామ ప్రతిష్ట పంచ ఆలయాలలో సంగమేశ్వర ఆలయం మూడవది .దేవతా ప్రతిష్ట ,ఏకశిలా ఆలయం .ఆలయ సమీపాన పురాత వూడల మర్రి విశిష్టముగ దర్శనమిస్తుంది .సమీపాన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం ఉంది .వివాహం కావాలని పెండ్లికాని యువతి ,యువకులు ఇక్కడ స్వామిని కొలిచిన శీఘ్రమే వివాహ సంభందం
కుదురునని నమ్మకం .
ఆద్యంతం మహిమాన్వితమైన సంగమేశ్వర దర్శనం శ్రీకాకుళం జిల్లా ,రాజాం పట్టణానికి 28 కిలోమీటర్ల దూరాన ఉంది .మీకు సంగమేశ్వర దర్శనం ప్రాప్తి రస్తు :!!
- రిపోర్టింగ్
చేబియ్యం .శ్రీనివాసరావు ,శ్రీకాకుళం 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి