6, డిసెంబర్ 2020, ఆదివారం

మౌనం - వాక్కు

 🌷 *మౌనం - వాక్కు * 🌷


🌷🌷🌷🍂🍂🍂🌷🌷🌷


*మౌనం అంటే మూగబోవాల్సింది మనస్సేగాని వాక్కు కాదు* అని గ్రహించాలి. 

 

అసలు *వాక్కు నాలుగువిధాలు. అవే 


🌷 పరా


🌷 పశ్యంతి


🌷 మధ్యమ


🌷 వైఖరీ ... అని. 


*ఇక ఐదవరకం లేదు*. 


🌷*వైఖరి* 🌷


ఎల్లప్పుడూ లోకవ్యవహారాలు, వ్యర్థప్రసంగాలు, చెప్పిందే చెప్పి సాగదీయటాలు - *ఇవన్నీ 'వైఖరీ' అంటారు. లోకంలో వీరే ఎక్కువ*. వీరు వాక్కును వ్యర్థం చేయటమే గాక, అనేక అబద్ధాలు మాట్లాడటం జరుగుతుంది. 


🌷 *మధ్యమ* 🌷


కొందరు ప్రాపంచికవిషయాలు, వ్యర్థప్రసంగాలతో బాటు అప్పుడప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు కూడా మాట్లాడుతారు. వీరి వాక్కులనే 'మధ్యమ' అంటారు. 


🌷 *పశ్యంతి* 🌷


భగవత్ సంబంధవిషయాలు గాని, ప్రాపంచిక విషయాలు గాని ఏవైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారి వాక్కులు 'పశ్యంతి'. 


🌷 *పరా* 🌷


పూర్తిగా ఆత్మకు సంబంధించిన విషయాలు, పరమాత్మ తత్త్వాన్ని తెలిపే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడితే ఆ వాక్కును 'పరా' అంటారు*. 

 

*మనం వైఖరీ వాక్కును మధ్యమ వాక్కునందు, మధ్యమ వాక్కును, పశ్యంతినందు, పశ్యంతి వాక్కును పరావాక్కునందు లయంజేసి 'ఆ పరబ్రహ్మను నేనే' అని గ్రహించి అలా ఉండిపోవటమే నిజమైన మౌనం.*



🌷🌷🌷🍂🍂🍂🌷🌷🌷

కామెంట్‌లు లేవు: