18, జనవరి 2021, సోమవారం

స్వర్ణభస్మం

 స్వర్ణభస్మం ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ . 


      కొన్నిరకాల వ్యాధులలో మరియు కొన్ని మొండి జబ్బులలో ఔషధాలుగా మూలికలు కు బదులుగా భస్మాలు ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఫలితం కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే అల్లోపతి వైద్యవిధానంలో ఇంజక్షన్ మందు పనిచేసే సమయంకంటే లోపలే ఈ భస్మ ఔషధం అత్యంత వేగంగా ఫలితాన్ని ఇవ్వగలదు . 


                 ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇంకా భస్మాలు తయారు చేసే ప్రక్రియ మరియు తయారుచేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు . మూలికలు ఉపయోగించి ఔషదాలు తయారు చేసే ప్రక్రియకు పూర్తి బిన్నదిశలో ఈ భస్మ తయారి ప్రక్రియ ఉంటుంది.  


    మొదట మనం తయారు చేయాలి అనుకుంటున్న భస్మానికి మూల ధాతువుని సేకరించుకోవాలి . ఉదాహరణకి చెప్పాలంటే స్వర్ణభస్మ తయారి విధానం గురించి మీకు వివరిస్తాను .


         మంచి స్వర్ణపు రేకులను సేకరించుకొనవలెను . అది అత్యంత స్వచ్ఛమైనది అయి ఉండవలెను . ఆ రేకులను మొదట కాల్చి నువ్వులనూనె , పుల్లటి మజ్జిగ , ఉలవ కట్టు , ఆవుపంచితం వీనిలో 7 పర్యాయములు వేసిన శుద్ది అగును. లేదా ఎర్రటి ముండ్ల తోటకూర నూరి ఆ రసము నందు బంగారు రేకులను 2 దినములు నానబెట్టినను స్వర్ణం శుద్ది అగును. 


                   ఆ విధంగా శుద్ది అయినటువంటి స్వర్ణపు రేకులను చిన్న కుండ యందు ఉంచి పైన ఒక మట్టిచిప్ప బోర్లించి లోపలికి వాయుప్రసారం జరగకుండా చుట్టూ చీల మన్ను ఉపయోగించి సీలు వేయవలెను . దానిని నడుము వరకు తీసినటువంటి గొయ్యి మధ్యభాగం నందు ఉంచి అన్నివైపులా సెగ తగిలేవిధంగా చుట్టూ ఆవుపిడకలని పేర్చుకుంటూ రావలెను . ఆ పిడకల సంఖ్య 500 వరకు ఉండవలెను . దీనినే ఆయుర్వేద పరిభాషలో            " గజపుటం " అంటారు . 


                 ఈ విదంగా అన్నివైపుల సమానంగా పేర్చిన తరువాత మన ఇష్టదైవాన్ని మరియు ధన్వంతరిని ప్రార్ధించి ఒక క్రమ పద్దతిలో ఆ పిడకలని వెలిగించవలెను . ఆయొక్క పిడకల వేడికి లోపల ఉన్నటువంటి స్వర్ణపు రేకులు భస్మంగా మారతాయి.  ఆ తరువాత దానిని జాగ్రత్తగా సేకరించుకుని తగిన మోతాదుల్లో ఔషదాల్లో వాడుకోవచ్చు .  ఇది అత్యద్బుతంగా పనిచేయును . తరుచుగా కొన్ని ప్రత్యేక ఔషధాలలో నేను దీనిని వాడుతాను. 


            దీనిని ఉపయోగించుట వలన త్రిదోషములు అనగా వాత ,పిత్త ,కఫములు దోషం పొందడం వలన కలుగు వ్యాదులను పొగొట్టును. ముఖ్యంగా వాతవ్యాధులను హరించుటలో చాలా ఉపయోగపడును. లొపలికి తీసుకోవడడం వలన నేత్రవ్యాధులను హరించును . ఆయుషుని వృద్ధిపరుచును. బుద్దిని పెంచును. నేను ఇప్పటివరకు దీనిని చాలా రోగాలపై ప్రయోగించి విశేషమైన ఫలితాలు పొందాను. క్షయరోగం నివారించుటలో ఇది నాకు చాలా సహాయపడింది.  అజీర్ణం వలన కలుగు జ్వరాన్ని నివారించును. ఎంతో బలమైన ఔషదాలు వాడినను తగ్గని మొండి వ్యాదులను ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గించవచ్చు.  


     

                  విషము తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ముందు తామ్రభస్మంతో ముందు వాంతిని చేయించి  ఒక పావుతులం స్వర్ణ భస్మమును లొపలికి ఇచ్చిన విషము కంటే వేగముగా హృదయమును చేరి హృదయం నకు విషమును చేరకుండా అడ్డుకొనును . కాని పావుతులం ఒకేసారి ఒక్క మోతాదుగా ఇవ్వవలెను . 


              ఈ స్వర్ణభస్మముని 10 గ్రాములను 60 మోతాదులుగా లేదా 100 మోతాదుగా విభజించి వాడుకోవచ్చు . దీనిని ఎంత పెద్ద మోతాదులో వాడినను ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించవు. మీకు ఎటువంటి సమస్యలు లేకున్నను ధనమును ఖర్చుపెట్టగలవారు వాడుకొనవచ్చు. 


          మంచి ఆరోగ్యం , మేధాశక్తి, హృదయమునుకు బలమునిచ్చును. రక్తపోటు వ్యాధి ఉన్నవారు దీనిని వాడటం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా రసాయన ఔషదం దీనిని ఉపయోగించువారికి పెట్టుడు మందులు మరియు విషములు వారిపై పనిచేయవు.  ఆపకుండా 20 సంవత్సరములు ఉపయొగించువారికి "కాయసిద్ధి " కలగచేయును . అనగా వయస్సు పెరుగుతున్నా ముసలి లక్షణములు కలగవు. 


           ఈ స్వర్ణభస్మానికి మరికొన్ని భస్మాలు కలిపి మధుమేహరోగులు తీసుకోవచ్చు. ఈ స్వర్ణభస్మ సేవించడం వలన మధుమేహ రోగులలో అంతర్గత అవయవాలు మధుమేహం పెరగటం వలన దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధముగా స్త్రీలకు , పిల్లలకు లేహ్యాలలో కలిపి ఇవ్వడం ద్వారా వయస్సురీత్యా వచ్చు హార్మోనల్ సమస్యలకు మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అద్భుతముగా పనిచేయును . పిల్లలకు మంచి తెలివితేటలు కలుగును. మేధస్సు పెరుగును . శరీరదోషాలు పోగొట్టును. 


           మరికొన్ని ఉపయోగాలు కూడా మీకు వివరిస్తాను.


   *  స్వర్ణభస్మం త్రిదోష జనితవ్యాధులను పోగొట్టును . విశేషముగా వాతవ్యాధులను హరించును . 


 *  శరీరం నందలి వాత, పిత్త , శ్లేష్మాలను సమానస్థితి యందు ఉంచును. 


 * వీర్యమును అభివృద్ది చేయును . బలాన్ని కలిగించును. గొప్ప రసాయనఔషధము . 


 * స్వర్ణసేవన వలన నేత్రరోగములు హరించి నేత్రాలకు బలము కలుగును. 


 *  ఆయుష్షుని పెంచడంలో దీనికిదే సాటి . ఆయువుని వృద్ధిచేయు ఔషధములు లోకము నందు బహు అరుదుగా ఉన్నవి. ఆ ఔషధములలో స్వర్ణభస్మం ప్రధానమైనది. 


 *  ఇది అత్యంత శ్రేష్టమైనది  బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని అనగా బుద్ది , స్మృతి , మతిని కలిగించును. 


 *  ఉన్మాదం వంటి మానసిక రోగములను పోగొట్టును . 


 *  రక్తాన్ని  శుభ్రపరచును. శరీరకాంతి కలిగించును. 


 *  పాపము వలన సంక్రమించు రోగములను పోగొట్టు శక్తి కలిగినది . 


 *  క్షయరోగమును పోగొట్టటంలో శక్తివంతముగా పనిచేయును . 


 *  వ్యాధివలన కాని లేక మరేదైనా కారణం వలన శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠి కలిగించును. 


 *  రక్తము నందలి , ఉపిరితిత్తుల యందలి క్రిములను నాశనం చేయును . 


 *  జ్వరములను హరించును . 


 *  ఇతర ఔషధముల వలన తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గును . 


 *  పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయొగించవలెను . 


 *  స్వర్ణభస్మ సేవన చేయువానికి పెట్టుడు మందులు , విషాలు ఎక్కవు. 


 * ఇది ఎంత పెద్ద మోతాదు వాడినను ప్రమాదము లేదు . వ్యాది బలాన్ని అనుసరించి 1 తులము 60 మోతాదుల నుండి 100 మోతాదులుగా వాడుకోవచ్చు . 


.*  శరీరం నందలి కండరాలు , ఎముకలు , నరాలకు అత్యంత శక్తికి ప్రసాదించును. 


 *  రక్తపోటు ( BP ) సమస్య నివారించును . 


 *  ఇది ఆపకుండా వాడిన ముసలితనమును దగ్గరకు రానివ్వదు. సమస్త  వాతరోగములను హరించును . 


       పైన చెప్పిన యోగాలు మాత్రమే కాకుండా మరికొన్ని ఔషధాలలో స్వర్ణాన్ని కలపడం ద్వారా ఔషధ బలం పెరిగి ఫలితం త్వరగా రావటం నేను గమనించాను. స్త్రీలకు , పిల్లలకు దీనికి మూలికాలేహ్యములలో కలిపి ఇవ్వవచ్చు. ముఖ్యముగా స్త్రీలలో గర్భశయ దోషాలు , నెలసరి సమస్యల నివారణ జరిగింది. ముత్యభస్మమునకు దీనికి కలిపి ఇవ్వడం వలన స్త్రీలలో శరీరబలం పెరిగి స్త్రీలు ఎదుర్కొనే క్యాల్షియం సమస్య నివారణ అగును. శరీరకాంతి పెరుగును . ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో శిశువుకు చేయు స్వర్ణప్రాసన గురించి చాలా చక్కగా వివరించారు . పుష్యార్కయోగం అనగా గురువారం పుష్యమి నక్షత్రం లేదా ఆదివారం పుష్యమి నక్షత్ర సమయాన శిశువునకు స్వర్ణప్రాసన చేయించవలెను . 


            స్వర్ణప్రాసన అనగా ప్రస్తుతం చేతికి ఉన్న ఉంగరం తీసి శిశువు నాలికమీద రాస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒక గుండుపిన్ను లేదా ఏదైనా సన్నటి వస్తువు తీసుకుని తేనె తగిలించి ఆ తరువాత ఆవునెయ్యి తగిలించి తరువాత స్వర్ణభస్మానికి తగిలించి అప్పుడు శిశువు నాలిక మీద అంటించి లొపలికి ఇవ్వవలెను. కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో తల్లి కడుపు నుంచి శిశువు బయటకి వచ్చిన తరువాత శుభ్రపరచి తేనెతో  పాటు స్వర్ణభస్మాన్ని నాలికపైన రాయవలెను అని ఉన్నది. ఈ స్వర్ణభస్మం నిత్యం పిల్లలకు వాడించుచున్న బ్రహుస్పతితో సమానమైన తెలివితేటలు కలవారు , ఏకసంధాగ్రాహుకులుగా తయారగును . 


         ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి రోగనిరోధకశక్తి అత్యంత అవశ్యము.  రోగనిరోధకశక్తి పెరగడానికి స్వర్ణభస్మ సేవన చేయుట అత్యంత ప్రధానం. ఈ స్వర్ణభస్మం కొంచం ఖరీదు ఎక్కువుగా ఉండును. అవకాశం ఉన్నవారు , ధనమును వెచ్చించ గలిగినవారు తప్పక స్వర్ణభస్మ సేవన చేయదగిన సూచన . అనుభవ వైద్యుల సలహా ప్రకారం మాత్రమే వాడగలరు . 



 గమనిక  - 


        ఈ స్వర్ణభస్మాన్ని సరైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకోండి. ఖరీదు ఎక్కువగా ఉండును. 


  


  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: