22, మే 2021, శనివారం

ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధం

 నెల్లూరు కృష్ణపట్నం శ్రీ ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధంలో వాడు మూలికల పైన నా సంపూర్ణ విశ్లేషణ  - 1 . 



 *   తెల్ల జిల్లేడు పువ్వుల మొగ్గలు  - 


    ఇది శరీరముకు వేడిని కలిగించు గుణము కలిగినది . క్షయ మీద అద్బుతముగా పనిచేయును . క్షయ అనునది శ్వాస సంబంద సమస్య . ఈ పువ్వుల మొగ్గలకు నాభి , లవంగాలు కలిపి ఆయాసం , దగ్గు పైన ప్రయోగిస్తారు . గొంతులోని నంజును పోగొట్టును . క్రిమిదోషమును పోగొట్టు శక్తి కలిగినది . కఫాన్ని హరించును . ఉదరము మరియు మలము నందలి క్రిములను హరించును . 


 *  తేనె  - 


     ఇది శ్లేష్మాన్ని హరించును . గొంతులో తీగలు తీగలుగా వచ్చు శ్లేష్మాన్ని కోయును . గొంతులో శ్లేష్మం తీగలుతీగలుగా ఏర్పడినప్పుడు శ్వాసనాళాన్ని చుట్టి శ్వాస తీసుకోనివ్వకుండా చేసి మనిషిని చంపును.  ఎక్కిళ్లను హరించును . శ్వాస , కాసలను హరించును . ఇది క్రిముల వలన జనించు రోగములను హరించును . 


 *  అల్లం  -  


     ఇది కారముగా , శరీరానికి వేడి కలిగించునదిగా ఉండును . గొంతులోని నంజును , కఫమును , కంఠ రోగమును నివారణ చేయును . దగ్గు , శ్వాసరోగమును హరించును . కఫమును హరించును . అల్లపు ద్రావకం జ్వరాన్ని హరించును .

ముక్కునుంచి  నీరు కారు పీనస రోగమును హరించును . కఫము వలన కలుగు దాహరోగమును తగ్గించును . లివర్ ని శుభ్రపర్చును..



       నేను అంతకు ముందు కరోనా గురించి వివరించిన పోస్టు నందు కరోనా అనేది శరీరము నందు కఫదోషము పెంచును అని వివరించటం జరిగింది. శ్రీ ఆనందయ్య గారి ఔషధ మిశ్రమము నందు ఉపయోగించు మూలికలను పరిశీలించినప్పుడు అన్నియు శరీరము నందు వేడిని కలిగించి ప్రాణశక్తిని పెంచేవిగా ఉన్నాయి. 


     మిగిలిన  మూలికల సంపూర్ణ సమాచారాన్ని మరొక పోస్టు నందు వివరిస్తాను . 



              కాళహస్తి వేంకటేశ్వరరావు 


          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

కామెంట్‌లు లేవు: