8, జూన్ 2021, మంగళవారం

అనుమానాన్ని నివృత్తి చేయగోరుతున్నాను.

 మీరందరూ రుద్రాభిషేకం వినే వుంటారు. యిది ఈశ్వరుని నామ విశేషాలను నమకంతోనూ చమకంతోనూ వర్ణించేది. ప్రతి వర్ణన నమకంలో నమఃతోను చమకంలో చకారముతోనూ అంతమయ్యే పదాలు. 


ఈ రుద్రాభిషేకం 5వ అనువాకం 4వ శ్లోకం లో

నమః కపర్దినేచ, వ్యుప్తకేశాయచ అని రావడం గమనించగలరు.  


కపర్ది అంటే జటాజూటం కలవాడని, దాని ప్రక్కనే వ్యుప్తకేశాయచ అంటే బోడి గుండు అంటే శిరస్సుపై వెంట్రుకలు లేకుండా ముండిత శిరస్కులు అని పద ప్రయోగం.  


ఈశ్వరుడిని లింగాకారంలోనే పూజింపబడడం పరిపాటి. అలాంటిది వారి పూర్తి శరీర సౌందర్యాన్ని ఎవ్వరూ చూసినట్టుగాని వినినట్టుగాని దాఖలాలు లేవు కదా. అలాంటి పరిస్థితులలో  జటాజూటంతో లేకుండా శరీరాకృతిని ఊహించడం కష్టమే. 


ఎక్కడైనా అలాంటి ఆకృతిని చూచారా, అటువంటి విగ్రహము నేను చూడలేదు.


కాని వ్యుప్తకేశాయచ అన్న వర్ణనను ఆపాదించడంలో ఆంతర్యమేమిటి. ఈ నా అనుమానాన్ని నివృత్తి చేయగోరుతున్నాను.

కామెంట్‌లు లేవు: