13, డిసెంబర్ 2021, సోమవారం

దత్తావతార స్వరూపం,

 తొలి కలియుగ దత్తావతార స్వరూపం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ! 1320 సంవత్సరం, చిత్తా నక్షత్రంలో, వినాయక చతుర్ధి నాడు పీఠికాపురాన (ఆంధ్రప్రదేశ్ లో) జన్మించి తదుపరి తన పదునారవ ఏట భరత ఖండంలో వివిధ ప్రాంతాలందు సంచరించి, తదుపరి కాలాన కురువపురమందు (నేటి కర్నాటక రాష్ట్రంలో, రాయచూర్ జిల్లాలో) తపమాచరించి 1350 సంవత్సరం, హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు, వల్లభాపురం, నేటి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ - వేణీ నదుల సంగమమందు అంతర్హితమై వల్లభాపురం, కురువపురం వచ్చే భక్తులకు తన దివ్యాశీస్సులు అందిస్తూ వారిని అనుగ్రహిస్తున్నారు ! నేడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి సందర్భంగా ఆ స్వామి అనుగ్రహం యావత్ విశ్వ జీవజాలానికి కలగాలని, ఆ స్వామి దివ్యాశీస్సులతో నేటి విశ్వ సమస్యలు, యావత్ విశ్వంలో ఆవరించియున్న సకల విష వ్యాధులు పూర్తిగా సమసిపోయి, అందరూ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా ఆశిస్తూ.. "దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ! ఔదుంబరా ఔదుంబరా దత్తావధూతా ఔదుంబరా ! " " శ్రీపాద రాజం శరణం ప్రపద్యే " 🙏🙏🙏🙏🙏 గుళ్లపల్లి ఆంజనేయులు 

కామెంట్‌లు లేవు: