1, ఏప్రిల్ 2023, శనివారం

ఊరక రారు మహాత్ములు"

 అనుకోని అతిథులు యింటికి  వచ్చినప్పుడు మనలోచాలామంది "ఊరక రారు

మహాత్ములు" అనడం లోకంలో పరిపాటి. ఇది ఒకనానుడిగా ప్రచారములో వుంది. ఇది

భాగవతములోని ఒక పద్య పాదం

ఊరకరారు మహాత్ములు

వా రథముల యిండ్లకాడకు వచ్చుటలెల్లన్

గారణములు మంగళములకు

మీ రాక శుభంబు మాకు నిజాము మహాత్మా!

భాగవతములో దశమ స్కంధము లోని పద్యము. నందుని యింటబాలకృష్ణుడున్నాడనీ,

వెళ్లి ఆశీర్వదించమనీ, గర్గ మహర్షిని కోరుతాడు వసుదేవుడు. అప్పుడామహర్షి నందుని

యింటికి వస్తాడు. అతని రాకకు సంతోషిణా నందుడు ఆనందంగా పలకరించే సందర్భానికి

పోతన వ్రాసిన పద్యమిది. నాలాంటి వారింటికి మీ వంటి మహాత్ములు వూరికెనే రారు.

మహాత్ములారాకకు మంగళప్రదమైన కారణం ఏదో వుండి ఉంటుంది.అని నందుడు

వినయంతో చెప్పిన పద్యమిది.

కామెంట్‌లు లేవు: