13, జూన్ 2023, మంగళవారం

అద్భుత_అరుణాచలంలో_అనుభూతి

  #అద్భుత_అరుణాచలంలో_అనుభూతి

(చివరి వరకు పూర్తిగా చదవండి)


అరుణాచల గిరి ప్రదక్షిణలో ఒక విదేశీ సోదరితో జరిగిన సంభాషణలో తెలిసిన తత్వం...


నేను: అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ?


విదేశీ యువతి : ఉక్రెయిన్ నుండి... ఎందుకు అడుగుతున్నారు...?


నేను : ఏం లేదమ్మా... మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు ?


వి. యు.: శివుడి కోసమే వచ్చాము, శివుడే తీసుకువచ్చారు.


నేను : ఎంతమంది వచ్చారు ? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ?


వి. యు.: మొత్తం 65 మంది వచ్చాము, ఇన్ని రోజులు అని అనుకోలేదు.


నేను : మీకు శివయ్య గురించి మోటివెట్ చేసిన వారు ఎవరు ?


వి. యు.: ఎవరో మోటివేట్ చేస్తే పరిచయం వస్తుందేమో, కానీ నమ్మకం శోధనతోనే కలుగుతుంది, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంది.

(నిజంగా చెప్పుడు మాటకు విని మతం మారుతున్న ప్రతీ హిందువు నేర్చుకోవాలి)


నేను: ఇంతకీ శివుడి గురించి మీరు ఏం తెలుసుకున్నారు. శివుడు అంటే ఎవరు ?


వి. యు.: ఎవరు అంటే, మీరూ శివుడే, నేనూ శివుడే. సర్వం శివమయం.


నేను: మరి మీరు మిగిలిన దేవుళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదా..?


వి. యు.: ఎవరి గురించి తెలుసుకున్నా అందరూ చివరికి శివుడే కదా... ఏం తేడా లేదు కదా...


నేను: శివయ్యని నమ్మాక మీకు ఏమనిపిస్తుంది ? మీరు శివయ్యను చూసారా ?


వి. యు.: చూసి నమ్మితే నిజం అంటారు ? చూడకపోయినా అనుభవం ద్వారా తెలుసుకుంటే సత్యం అంటారు. సత్యం శివం సుందరం.


నేను : మీ వయసు ఎంత అమ్మా ?


వి. యు.: 21 సంవత్సరాలు. మెడిసిన్ చదువుతున్నాను.


నేను: ఇంత చిన్న వయసులో, అంత చదువు చదువుతూ ఇలాంటివన్నీ ఎలా నమ్ముతున్నారు ?


వి. యు.: చిన్న వయసు కాబట్టే శివుణ్ణి తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంత చదువుతున్నాను కాబట్టే, చదువు కంటే విలువైన జ్ఞానం శివుడని నమ్ముతున్నాను.


నేను : నీ పాదాలకు నమస్కారం తల్లీ... (అనుకుంటూ వాళ్ళ దగ్గర నుండి పక్కకు జరిగి వారి యాత్రను చూస్తూ తరించాను)


గమనిక : గొప్ప విశేషం ఏమిటంటే బొట్టు బరువైన భారత బాలికలలా కాకుండా, చక్కటి వస్త్ర ధారణతో, బొట్టుతో, క్రమశిక్షణతో చెప్పులు లేకుండా సాగుతున్న వాళ్ళ యాత్ర ను చూసి గుండె పులకించింది. అంతే కాదు ఆ చెల్లి నాకు సమాధానం చెబుతూ, ప్రశ్నకు ప్రశ్నకు మధ్య సమయంలో #నమః_శివాయ అంటూ స్మరణ చేస్తూనే ఉంది. 


అంతే కాదు ఇదే సంభాషణ ఎవరైనా భారతీయులతోనో, హిందువులతోనో అయితే అంత ఎక్సైట్ అయ్యేవాడిని కాదు. కానీ విదేశీయురాలు, పైగా 21 సంవత్సరాల చిన్న అమ్మాయి, శివయ్య తత్వాన్ని అంత సున్నితంగా తెల్చేసిన బంగారు తల్లి మాటలు విని ఆనంద భాష్పాలు వచ్చాయి.


ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ.. మనకు మాటలంటే ఓకే కానీ, వ్రాతకు బద్దకం కదా... అందుకే ఇంతవరకు వ్రాయగలిగాను... (చెప్పడం కుదిరిందో లేదో తెలియదు, కానీ చెప్పాలనిపించింది చెప్పాను)


భారత దేశాన్ని ఏదో చెయ్యాలని విదేశీ మతాలు కుట్రలు చేస్తుంటే, యెటువంటి కుట్రలతో పని లేకుండా ప్రపంచమంతా హిందుత్వం వైపు నడుస్తుంది. ఇది ధర్మ విజయం...


ఏది ఏమైనా, రెండో సారి వెళ్ళినప్పుడు మాత్రం అరుణాచలం గొప్పదనాన్ని ఆస్వాదించాను.


శివయ్య... పునః దర్శన ప్రాప్తిరస్తు

కామెంట్‌లు లేవు: