15, జులై 2023, శనివారం

ఆచరణ వల్ల మాత్రమే

 శ్లోకం:☝️

*అంతస్తిమిరనాశాయ*

 *శబ్దబోధో నిరర్థకః ।*

*న నశ్యతి తమో నామ*

 *కృతయ దీపవార్తయా॥*


అన్వయం: _మనసి యః తమః పూరితః వర్తతే తస్య శమనం నీతివాక్యైః ఏవ న భవితుం శక్నోతి యథా రాత్రికాలస్య అంధకారః దీపవిషయే చర్చాం కృత్వా న నశ్యతి ।_


భావం: కేవలం "దీప" శబ్దానికి అర్థం తెలుసుకోవడం ద్వారా లేక ఉచ్ఛరించడం ద్వారానో చీకట్లు తొలగింపబడవు. అటులనే నీతి వాక్యలు చదివినంత మాత్రాన లేక వల్లె వేసినంత మాత్రాన మానసిక చీకట్లు పోవు. అంటే ఆచరణ వల్ల మాత్రమే మానసిక పరివర్తన సాధ్యమవుతుందని భావం.🙏

కామెంట్‌లు లేవు: