27, జులై 2023, గురువారం

షోడశ గణపతి స్తోత్రం

 *షోడశ గణపతి స్తోత్రం (సకల శుభాలను ఇచ్చే స్తోత్రం)*


ఈ స్తోత్రం 'షోడశ గణపతి స్తోత్రం' గా ప్రసిద్ధి పొందింది, ద్వాదశ గణపతి స్తోత్రం వలెనే ఇదికూడ సమస్త శుభ ఫలితములను ఇచ్చును.


ప్రథమం బాలవిఘ్నేశం ద్వితీయం తరుణం భవేత్!

తృతీయం భక్తవిఘ్నేశం చతుర్థం వీరవిఘ్నకం!!


పంచమం శక్తి విఘ్నేశం షష్ఠం ధ్వజగణాధిపం!

సప్తమం పింగళం దేవం అష్టమోచ్ఛిష్ట నాయకమ్!!


నవమం విఘ్నరాజం స్యాత్ దశమం క్షిప్రనాయకం!

ఏకాదశం తు హేరంబం ద్వాదశం లక్ష్మీనాయకమ్!!


త్రయోదశం మహా విఘ్నం భువనేశం చతుర్దశం!

నృత్తాఖ్యం చ పంచదశం షోడశోర్ధ్వగణాధిపమ్!!


గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్తితః!

సంస్మరేత్ సర్వకుశలం సంప్రయాతి నసంశయః!!


1. బాలగణపతి

2. తరుణగణపతి

3. భక్తగణపతి

4. వీరగణపతి

5. శక్తిగణపతి

6. ధ్వజగణపతి (ద్విజ)

7. పింగళ గణపతి (సిద్ధి)

8. ఉచ్ఛిష్టగణపతి

9. విఘ్నరాజగణపతి

10. క్షిప్రగణపతి 

11. హేరంబగణపతి

12. లక్ష్మీగణపతి

13. మహావిఘ్నగణపతి

14. భువనేశ గణపతి (విజయ)

15. నృత్త గణపతి

16. ఊర్ధ్వగణపతి


ప్రతి దినము ప్రాతఃకాలమున ఈ 16 గణపతుల నామములు స్మరించిన సకల శుభములు కలుగును.


🙏 సర్వే జనాన్ సుఖినోభవంతు 🙏



సేకరణ:

కామెంట్‌లు లేవు: