26, ఆగస్టు 2023, శనివారం

యజ్ఞోపవీతం

 *యజ్ఞోపవీతం గురించి కొంత సమయం వెచ్చించి చదివి తెలుసుకోండి.*

ఒకజత(మూడు ముడులు) సరిగా వడకాలంటే ఒకరోజు సమయం పడుతుంది., కానీ బయట వ్యాపారాత్మక యజ్ఞోపవీతాలు 20₹,30₹ లకే ఐదు ముడుల జతలు ఇస్తున్నారంటే అవి యజ్ఞోపవీతాలేనా అనే అనుమానం ఈనాడు బ్రాహ్మణులకే కలగకపోవడం చాలా బాధాకరం. కనీసం చిలపదారంతో యజ్ఞోపవీతం జత(మూడుముడులు) తయారు చేయాలన్నా4,5 గంటల సమయం పడుతుంది. అంటే ఒక బ్రాహ్మణుని అరదినం పనికి సాటి బ్రాహ్మణుడు నిర్ధారించే విలువ 20₹ అన్నమాట. ఒక చిన్న వైద్యుని సంప్రదించడానికే 500₹ ,ఒక కాఫీతాగడానికే 50₹, ఒక సినిమా చూడటానికి500₹, ఒక కూల్ డ్రింక్ తాగడానికి30₹ పెట్టే బ్రాహ్మణులు యజ్ఞోపవీతానికి 20₹ ఇవ్వాలనుకోవడం ఎంతనీచము?? దాని పేరే యజ్ఞోపవీతం, కనీసం దాని అర్థమైనా తెలుసా!!?? అసలు అది ఎలా చేస్తారో తెలుసా!!?? స్వంతంగా యజ్ఞోపవీతం తయారు చేసుకోలేనివారు,దాని కి సరైన విలువ ఇవ్వలేనివారు బ్రాహ్మణులమని గర్వంగా చెప్పుకోవడం ఎంతవరకూ సమంజసం!!?? మనం చదివే మంత్రం పనిచేయాలంటే దానికి మూలాధార సూత్రమైన యజ్ఞోపవీతం సరైనది అయ్యుండాలి. రాగితీగలకు కలిపితేనే(దారాలకుకాదని) విద్యుచ్చక్తి దీపాన్ని వెలిగిస్తుందని కళ్ళకు కనిపిస్తుంది, కానీ యజ్ఞోపవీతం3×96 బెత్తలమన చేతికొలతలో ఏక తంతువును తాల్చి,మూడు పోచలుగా కలిపి బ్రహ్మ ముడి తో బంధించి ధరించిన ద్విజుడు చదివే మంత్రమే ఫలిస్తుందని వెంటనే కనబడదు కదా!!

కనీసం ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా అయినా యజ్ఞోపవీతం ఎలా చేసుకోవాలో తెలుసుకుని ధరించి తరించి ద్విజలమని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేయండి. యజ్ఞోపవీతం అనే ది ఇరవై ముఫ్ఫై రూపాయల కు లభించేదారం కాదనీ ద్విజుల శక్తి ని నిర్ణయించే బ్రహ్మ సూత్రమనీ తెలుసుకుని మన కర్మలు ఫలించాలంటే ఈ సూత్రం సక్రమమైనదై ఉండాలని గుర్తించండి. అసలైన యజ్ఞోపవీతం ధరించి త్రికాల సంధ్యావందనం ఆచరించే ద్విజునకు చేసే నమస్కారం సాక్షాత్తూ దేవుని కి చేసే పూజతో సమానం.

 సులభంగా యజ్ఞోపవీతం తయారు చేసుకొనే ఎలక్ట్రానిక్ యంత్రాలు మేము తయారు చేసి ఇవ్వగలము. కావలసిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు (9492050200). యజ్ఞోపవీతం తయారీ మొదలైన వివరాలన్నీ నా YouTube channel "KOMPELLA SRINIVASA SARMA" లో వీడియో లు అందుబాటులో ఉన్నాయి.

శుభమస్తు.

కామెంట్‌లు లేవు: