28, ఆగస్టు 2023, సోమవారం

భగవద్గీత

 *నిత్యాన్వేషణ:*


భగవద్గీత ను చదివాక మీ జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా ?



భగవద్గీత మూలం కేవలం వంద శ్లోకాలతో వేదముల పిమ్మట భారతీయ తత్వ చింతన( ఫిలాసఫీ ) షడ్దర్శన ఉపనిషత్తులు నుండి సంగ్రహించిన రచన.


శ్రీ కృష్ణుడు అర్జునుడుకి యుద్ధ సమయమున భోదించినట్టుగా మహా భారత రచనలో కూర్చబడినది. ఆ కూర్పు వలన గీత మకరందం ది సాంగ్ అఫ్ ది గాడ్ గా విశ్వవ్యాపితం జరిగింది. ఒక ఉన్నతమైన ప్రయత్నం. కానీ అప్పటి బ్రాహ్మణులు/పండితులు వేరు వేరు మత శాఖలుగా విడిబడి ఒకిరినొకరు సంవాదించుకున్నారు. ఆ సంవాదాలలో గీతా మకరందం rivalry forces ఎవరికి ఇష్టమొచ్చిన మార్పులు -కూర్పులు చేసి దాదాపు ఆరు వందల శ్లోకాల తో పొడిగించి తమ తమ ఆధిక్యత చాటుకున్నారు. వేల సంవత్సరాలుగా గీత భారత దేశమున అత్యంత ప్రామాణిక -ఆధ్యాత్మిక -యోగ -భక్తి -తత్వ మున్నగు విభాగాలతో విలసిల్లుతూ , ఎందరో గీతా సందేశం -భోదన -లతో వ్యాఖ్యానాలు వచ్చినవి -ప్రస్తుతము కూడా వచ్చుచున్నవి. ఎవరి వ్యాఖ్యానం వారిదే !

కొన్ని అధ్యయాలు మార్పు చేర్పు లను తొలగించుకుంటూ పారాయణం ఒక అద్భుత తత్వ లోకం. భారతీయ ప్రామాణిక తత్వ భోదన.

కానీ ఇన్ని వేల సంవత్సరములుగా కఠోర పరిశ్రమ పారాయణం చేసి తమ జీవితాల దశను మార్చుకున్నవారు బహు తక్కువ. అసలు యావత్ హిందూ ప్రజానీకం ఇప్పటికే మార్పు చెంది ఉండాలి. ఒకదానికొకటి కాంట్రవర్సియల్ !

ఏది మార్పు ? కలహాలతో , అసమానతలతో , అసూయ ద్వేషాలతో , స్వార్ధముతో , కుటిలత్వం , తో కునారిల్లుతున్న హిందూ సమాజం మార్పు జరిగిందా ?

నేను అధ్యయనం చేసి నాకు పనికి రాదని నా స్వతంత్ర ఆలోచన -ఎటువంటి రిజర్వేషన్స్ లేని నాకు ఉపయోగపడు మార్గమును ఎన్నుకుని పయనిస్తున్నాను.

అంత మాత్రమున గీత మకరంద జ్ఞాన , వైరాగ్య , గుళికలను తక్కువ చేసే సాహసం చేయను. హిందూ గా నా పూర్వీకుల ఆస్తి ని గౌరవిస్తాను.


పునర్జన్మ గురించి భగవద్గీత ఏమి చెబుతోంది?


*జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ*

*తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితు మర్హసి.*  2–27

అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. 6–4

*బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే*

*వాసుదేవః స్సర్వ మితి స మహాత్మా సుదుర్లభః* 7–19

*బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున!*

*తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప!* 4–5

మొదలైన శ్లోకాలెన్నో భగవద్గీత లో ఉన్నాయి. కేవలం మానవులకే గాదు పునర్జన్మలు.. లోకాలకు లోకాలే పుడుతూ అంతరిస్తూంటాయి

*ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినోర్జున!* అంటాడు కృష్ణుడు.

*హతోవా ప్రాప్స్యసి స్వర్గం

జిత్వా వా భోక్ష్యసే మహీం* 2- 37.

అని ధర్మ యుద్ధం లో మరణిస్తే స్వర్గం తప్పక చేరుతారని గూడా గీతలో ఉంది.

*క్షీణే పుణ్యే మర్త్య లోకం విశన్తి…*

..చేసిన పుణ్యం స్వర్గలోకంలో అనుభవించేసి అయిపోతే మళ్ళీ కర్మ భూమియైన భూమండలంలో పుట్ట వలసిందే. జీవుడు తన వాసనల (ఇచ్ఛలు) కనుగుణంగా అనేక స్థావర జంగమ రూపాలూ పొంద గలడు. నిష్కామంగా తన విధులను నిర్వర్తిస్తూ ఉంటే పూర్వజన్మల కర్మ ఫలం అనుభవించేసి ఋణాలు అన్నీ తీరి పోయి ముక్తి ని పొందుతాడు జీవుడు.

యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ … ఎక్కడికి చేరి తిరిగి రారో — అది ముక్తి.

అనేక జన్మల సంస్కారఫలంగా వాసుదేవః సర్వం ..అనే వివేకం ఏర్పడుతుంది. (అంతటా భగవంతుడున్నాడు. )

ఇహైవ.తైః జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః .. అని మరోమాట ఉంది. మనసు తన ఇష్టం వచ్చినట్లుగా కర్మ లవైపు సాగుతూ ఉంటుంది ప్రారబ్ధ (వెనకటి) కర్మల వశాన. కానీ దాన్ని బుద్ధి తో నిగ్రహించి, సన్మార్గంలోకి నడిపితే జన్మను జయించినట్లే.. తస్మాత్ యోగీ భవార్జున ..అంటే నీ విధిని భగవన్నిర్ణీత శాస్త్ర విధిప్రకారం చేయి. అపుడు పాపపుణ్యాలనుంచీ విడుదల లభిస్తుంది..

కర్మ ఏదో అకర్మ ఏదో తెలుసుకోవడం కష్టం.

*కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః

స బుద్ధిమాన్ మనుష్యేషు…* 4–18 అంటుంది గీత .

మహాత్ముల చరిత్రలే సత్ మార్గాన్ని చూపిస్తాయి .సద్గతి కలిగిస్తాయి.

కామెంట్‌లు లేవు: