12, సెప్టెంబర్ 2023, మంగళవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 36*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 36*


 ఇక రెండవ దృశ్యం. ఇది నరేంద్రుడు జన్మించిన సమయంలో శ్రీరామకృష్ణులు చూసింది. ఆ సమయంలో కాశీ నుండి ఒక దివ్యకాంతి బయలుదేరి కలకత్తాలో జన్మ నెత్తినట్లు ఆయన చూశారు. 'నా ప్రార్ధన సఫలీకృతమయింది; నా సొంతమయిన అతడు ఒక రోజు ఇక్కడకు వస్తాడు' అంటూ ఆనందంతో ఆయన నృత్యం చేశారు.


ఇక శ్రీరామకృష్ణ - నరేంద్రుల సమావేశంలో జరిగిన సంఘటనలు పరికిద్దాం. సురేంద్రుని ఇంట్లో కలుసుకొన్నప్పుడే ఆతణ్ణి గుర్తించారు శ్రీరామకృష్ణులు. అప్పుడు అతడి శరీర లక్షణాలు ఇత్యాదులను నిశితంగా పరిశీలించారు. శ్రీరామకృష్ణులు తమ శిష్యులను పరీక్షించే

విధాలలో ఇది ఒకటి. నరేంద్రుని అవయవాల అమరికను గురించి శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. "ఇదుగో చూడు, నీ అంగ లక్షణాలు గొప్పగా ఉన్నాయి. కాని ఒక్క విషయం. 


నువ్వు నిద్రిస్తున్నప్పుడు బుస్సుబుస్సు మంటూ భారంగా శ్వాసిస్తావు. ఇలాంటి వారికి ఆయుస్సు తక్కువ అని యోగులు చెబుతారు.” మళ్లీ, "నువ్వొక మెట్ట వేదాంతివి కావని నీ కళ్లు చెబుతున్నాయి. నీలో నిరాడంబర భక్తీ, ప్రగాఢ జ్ఞానము జతచేరి ఉన్నాయి" అనీ చెప్పారు. మొదటి రోజు పరీక్ష సంతృప్తి కలిగించడంతో నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరం రమ్మని ఆయన ఆహ్వానించారు.


నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు. అతణ్ణి ఒంటరిగా తీసుకొనిపోయి, "నువ్వు ఫలానా ఋషివి" అని చెప్పారు. నరేంద్రునికి ఆ మాట అర్థం కాలేదు.


కనుక రెండవసారి వెళ్లినప్పుడు అతడికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి, అతణ్ణి ఉన్నత స్థితులకు అధిరోహింపజేసి, అతడి నుండి నిజాన్ని తెలుసుకోదలచి అతణ్ణి స్పృశించారు. కాని నరేంద్రుడు అందుకు సిద్ధంగా లేడు. "మహాశయా! నాకు తల్లితండ్రులున్నారు" అంటూ కేకపెట్టాడు. దాంతో శ్రీరామకృష్ణులు వదలి పెట్టారు.


మూడవసారి అతడు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు మాత్రమే శ్రీరామకృష్ణులు పూర్తిగా విజయం సాధించగలిగారు. ఆ రోజు అతణ్ణి స్పృశించినప్పుడు నరేం ద్రుడు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతణ్ణి ఉన్నత భావనాభూమిలో నిలిపి, అతడి అంతరాంతరాళాల్లో దాగివున్న అనేక విషయాలు తెలుసుకొన్నారు.


శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నరేంద్రుడు బాహ్యస్మృతిని కోల్పోయిన తరుణంలో అతడు ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకోసం జన్మించాడు.ఇక్కడ (ఈ ఇలలో) ఎంత కాలం ఉంటాడు మొదలైన ప్రశ్నలు అతణ్ణి అడిగాను. అతడు కూడా అంతర్ముఖుడై సముచితంగా జవాబులిచ్చాడు. నేను అతణ్ణి గురించి చూసినవాటినీ, తలచినవాటినీ ఆ జవాబులు ధ్రువీకరించాయి. వాటి నన్నింటినీ బహిర్గతం చేయరాదు. కాని అతడి జవాబుల నుండి ఒక విషయం స్పష్టమయింది. తాను ఎవరో తెలుసుకొన్న తరువాత అతడు ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు; అప్పుడే దృఢ సంకల్పంతో యోగమార్గంలో తన దేహాన్ని త్యజిస్తాడు. నరేంద్రుడు ధ్యానసిద్ధుడు, మహాత్ముడు."


శ్రీరామకృష్ణుల పరిశోధన ముగిసింది. కాని నరేంద్రుడు? అతడి మనస్సు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అతడి పరిశోధన మొదలయింది.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: