26, సెప్టెంబర్ 2023, మంగళవారం

_*మన దేవాలయాలు

 _*మన దేవాలయాలు*_



 _*నవ గ్రహ దేవాలయాలు..!!*_

*ఓం గం గణపతయే నమః*

 *ఓం నమః శివాయ..!!*

                        

*ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ*

*గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!* 


నవగ్రహములు తొమ్మిది, 

ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. 


*కుంభ‌కోణం:.*


తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. 

ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.


*1) సూర్యనార్ కోయిల్ ., తిరుమంగళంకుడి.*


తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో


సూర్యనార్ కోయిల్ అనీ పిలువబడే సూర్యదేవాలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమణులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్ష్మీని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించు కోవచ్చు. ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురా రోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది. 

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియ జేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు.


*2) చంద్రగ్రహ దేవాలయము., తిరువైయార్..*


తిరువైయారుకు 5k.mదూరములో 

చంద్రగ్రహ దేవాలయము వుంది. 

తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే 

చంద్ర దేవాలయములోని చంద్ర భగవానుని దర్శనము సుఖాన్ని, దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని 

భక్తుల నమ్మకము. మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. సెప్టెంబర్. అక్టోబర్ మాసాలలో వచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివ లింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది.


*3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము., వైథీశ్వరన్ కోవిల్.*


తిరువైయార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. 

దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. 

అనేక వ్యాధులను అంగారకుడు పోగొడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ల‌యిపోతుంది. ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము.వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .


*4) బుధగ్రహ దేవాలయము., తిరువెన్నాడు.*


అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది.ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. 

అమ్మవారు బ్రహ్మ విద్యయంభి కాదేవి.వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారానికి మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము.


*5) బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము., ఆలంగుడి.*


కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. 

ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు.ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము.దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు. శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణా మూర్తిగా పూజలు అందు కుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. 

పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు.

భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు.గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నాన బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుక బడిన వారు చదువులో మరియు 

ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, విద్యలో ఆటంకాలు, 

పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము.గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగు తుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము.


*6) శుక్ర గ్రహ దేవాలయము.*


కామ్చనూరు.కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది .

దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి. ఇక్కడే బ్రహ్మ దేవుడు, పార్వతీ పరమేశ్వరుల


వివాహాన్ని దర్శించాడట. ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు.


*7) శని గ్రహ దేవాలయము., తిరునల్లార్..* ఇది కుంభకోణానికి 53 k.m కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది .ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వ పాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయము లో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు, ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు. అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు.ఈ దేవాలయము దర్శించినపుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .

ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్న గుడి ఇదే.శనీశ్వరునితో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు . ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభిం చాడని కధ. ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌.

ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది.


*8) రాహు గ్రహ దేవాలయము.*

*తిరునగేశ్వరాము.*

కుంభకోణానికి 5 k.m దూరములో వుంది.ఇక్కడ రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే.

ఇక్కడ నిత్యము వచ్చే రాహుకాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్నినీలము రంగులోకి మార తాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు.ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’. ఇక్కడ ఆది శేషుడు, దక్షుడు, కారకోటుడు 

రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు.ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి.


*9) కేతు గ్రహ దేవాలయము.*

*కిల్ పేరుంపళ్లమ్.*


తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది. ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు. 

ఇక్కడ కేతు గ్రహానికి సంబందించిన నివారణ పూజలు చేస్తారు. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పా కారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి.


ఈ ఆలయాల వద్ద గల 9 పుష్కరిణిలో స్నానములు చేసి 12 వారాలు నవగ్రహాలను ఆరాదిస్తే, 

ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది. అదిత్యాయచ సోమాయ మంగళాయ బుదాయచ..గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!

ఓం నమః శివాయ..!!

లోకా సమస్తా సుఖినో భవంతు..!!                

*శ్రీమాత్రే నమః-శివాయ గురవే నమః*

*సేకరణ*

కామెంట్‌లు లేవు: