2, అక్టోబర్ 2023, సోమవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 40*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 40*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*తటిత్వన్తం శక్త్యా తిమిర పరిపన్థి స్ఫురణయా*

*స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేన్ద్రధనుషమ్ |*

*తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం*

*నిషేవే వర్షన్తం హరమిహిరతప్తం త్రిభువనమ్ ‖*


ఇప్పుడు మణిపూర చక్రానికి వచ్చారు. ఇది జలతత్త్వ చక్రం. శంకరులు అంటున్నారు..


తవ శ్యామం మేఘం = శివ స్వరూపం ఇక్కడ నీలమేఘం వలె ఉందట.


తటిత్వన్తం శక్త్యా = అమ్మవారేమో మెరుపుతీగ వలె ఉందట. ఆమె ఇంకా..


తిమిర పరిపన్థి స్ఫురణయా = చీకట్లను పారద్రోలే కాంతి వలెనూ


స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేన్ద్రధనుషమ్ = నానా రత్నాభరణముల ప్రకాశము వలె, ఇంద్రధనస్సు వలె ఉన్నారట. 

మణిపూర శబ్దంలోనే మణులు వున్నాయి కదా! అవి వెలుగులు చిమ్ముతూ ఉంటాయి.


చమత్కారం గమనించండి శివుడు నీలమేఘం వలె ఉంటే, అమ్మవారు ఆయనను విడవకుండా మెరుపుతీగ వలె కలిసి ఉన్నారట. మేఘము జలతత్త్వమయితే, మెరుపుతీగ అగ్నితత్త్వం. రెండూ ఉంటే వర్షం. ఇక్కడ శివ, శక్తుల సమయాచారం చెప్పారు. అలాగే *అగ్నీషోమ తత్త్వం* కూడా దృష్టికి తెస్తున్నారు. ఈ అగ్నీషోమ తత్త్వం  అంతర్యాగానికి చెప్పే మాట. లఘువుగా పరమాత్మ జీవాత్మ సంయోగమునకు సమన్వయమునకు సంకేతముగా చెప్పవచ్చు.


హరమిహిరతప్తం త్రిభువనమ్ నిషేవే వర్షంతం = హరుడు/శివుడు వేడెక్కించిన భూమిని నీవు వర్షంతో చల్లబరుస్తున్నావమ్మా. *భవదా వసుధా వృష్టిః పాపారణ్య దవానలా* అమ్మవారి నామాల్లో ఒకటి.


అగ్ని తత్త్వం తరువాత జలతత్త్వం.వేసవి తరువాత వర్ష కాలం వలె. ఇక్కడ స్వామి అమృతేశ్వరుడని, అమ్మవారు అమృతాంబ అనీ పిలువబడతారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: