6, అక్టోబర్ 2023, శుక్రవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 56*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 56*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*మాయ భీతిల్లే జ్ఞానం* 


నరేంద్రుడు శివాంశ సంభూతుడు. చిన్నతనం నుండే ధ్యానం, ఆత్మజ్ఞానం అతడిలో సహజసిద్ధంగానే విలసిల్లింది. ణ"లోకాన్నే సమ్మోహింపజేయగల మహామాయ శక్తి కూడా నరేంద్రునికి పది అడుగుల దూరంగామాత్రమే నిలువగలదు" అని అతడి జ్ఞానాన్ని గురించి  శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు.లౌకికపరమైన కోర్కెలన్నీ ఏకమొత్తంగా తెగ నరికి, భగవద్భావనలో లయించడానికి సిద్ధంగా ఉన్నాడు నరేంద్రుడు. 


తక్కిన శిష్యుల కోసం జగజ్జననిని "అమ్మా, లోకాన్ని సమ్మోహింపజేసే శక్తియైన ఆవరణను వీరి నుండి తొలగించు" అంటూ ప్రార్థించే శ్రీరామకృష్ణులు, నరేంద్రుని కోసం, "అమ్మా, నీ మాయాశక్తిని కించిత్తు నరేంద్రునిలో నిలిపివుంచు" అంటూ ప్రార్థించేవారు!


భక్తికి పరాకాష్టయైనా ప్రేమ భక్తి  ఎంతటిదైనప్పటికీ రాధాకృష్ణుల ప్రేమను నరేంద్రుడు అంగీకరించలేక పోయాడు.  శ్రీరామకృష్ణులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ రాధాకృష్ణుల తత్త్వాన్ని నరేంద్రునికి ఆకళింపు చేయలేకపోయారు. 


 అనుభవైకవేద్యం కానిదేదీ నరేంద్రుడు అంగీకరించడు గదా! కనుక శ్రీరామకృష్ణులు అతడికి అనుభవాన్ని అనుగ్రహించారు. ఒక రోజు నరేంద్రుని కలలో శ్రీరామకృష్ణులు కనిపించి, "రా, గోపికయైన రాధను నీకు చూపు తాను" అంటూ అతణ్ణి కాస్తదూరం తీసుకొని వెళ్లారు. తరువాత వెనుకకు తిరిగి, “రాధను ఎక్కడ అన్వేషిస్తావు?" అని అడిగి, సాక్షాత్తు తామే రాధగా మారి పోయారు. రాధ సౌందర్యం వర్ణనాతీతమై ఉండడాన్ని నరేంద్రుడు గాంచాడు. ఈ కల నరేంద్రుని జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: