18, అక్టోబర్ 2023, బుధవారం

ముల్లోకాలలోనూ సౌఖ్యములుండి

 *1962*

*కం*

సజ్జన సాంగత్యంబున

ముజ్జగముల సౌఖ్యముండి మోదము విరియున్.

సజ్జనులతొ వైరంబున

నెజ్జగమందైన తుదకు నెగడరు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మంచి వారి తో కలిసి జీవించడం వలన ముల్లోకాలలోనూ సౌఖ్యములుండి సంతోషం వెల్లివిరియును. మంచి వారి తో శత్రుత్వం వలన ఏ లోకంలో అయినా చివరకు గెలవరు.

*ఉదాహరణ*:-- భారతంలో దుర్యోధనాది కౌరవుల పక్షాన ఉన్న ద్రోణ,భీష్మాది యోధులంతా దుర్మరణం చెందగా శ్రీ కృష్ణ పరమాత్మ పక్షాన ఉన్న పాండవులు చిరవిజయులై రాజసూయయాగం కూడా చేయగలిగారు. దుర్జన సావాసం తాత్కాలిక సుఖములు కలిగించిననూ నిత్యం కాదు, కానీ సజ్జన సాంగత్యం తాత్కాలిక కష్టాలు కలిగించిననూ శాశ్వత సౌఖ్యకరము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: