28, నవంబర్ 2023, మంగళవారం

 హిందూ మ‌తంలో 108 ప్రాముఖ్య‌త.......?!


హిందూ మ‌తంలో 108కు ఎంతో విశిష్ట‌త ఉంది. మ‌నం ఏదైనా మంత్రం జ‌పించ‌డానికి ఈ సంఖ్య ముఖ్యం. ఉపనిషత్తులు 108 అష్టోత్తర నామావళి 108 జపమాలలో పూసలు 108 పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు .ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయి.

దేవభాషలో అక్షరాలు 108. భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు 108. దేవాలయానికి 108 ప్రదక్షిణలు చేయటం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. గాయత్రి 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు.కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుని పలువురికి తెలియ చేద్దాము...


దేవుడి స్మ‌ర‌ణ‌

ఓంకారం 108 సార్లు జపిస్తే భగవంతునికి దగ్గరయినట్లే అంటారు. హనుమాన్ చాలీసా 108 సార్లు ఉచ్చ‌రిస్తే కోరికలు సిద్ధిస్తాయంటారు. శనిదేవునికి 108 నామాలు ఉంటాయి.

ప్ర‌తి చోటా హిందువులు 108 అనే సంఖ్య‌కు ప్రాధాన్య‌త ఇచ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయి.


రాశి-న‌క్ష‌త్రాల ప‌రంగా

ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు. కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత వుంది..


ఖ‌గోళ ప‌రంగా 108 నంబ‌ర్ ఏ విధంగా ముఖ్యం అంటే....


సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు. ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 1391000 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య రమారమి 108. .

అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లు. దాన్ని చంద్రుని చుట్టుకొలత అయిన 3474 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య 108.

27 న‌క్ష‌త్రాలు, ప్ర‌తి న‌క్ష‌త్రానికి 4 పాదాలు = 27x 4 = 108

12 రాశులు, 9 న‌క్ష‌త్ర పాదాలు = 12x9=108


హైంద‌వ జీవ‌న విధానం ఆధారంగా 108

మ‌న‌కు ఉన్న ముఖ్య శివ‌లింగాల సంఖ్య 108, అందుకే శైవ మ‌త‌స్థులు 108 కు ప్రాముఖ్య‌తనిస్తుంటారు.


గౌడియ వైష్ణవంలో బృందావనం లో 108 గోపికలను పూజిస్తారు.

దేశంలో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి.

కంబోడియాలో ఆంగ్‌కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.


జ‌పమాల‌లో 108 పూస‌లు

శాస్త్రం ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటారు.

అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ని లెక్క‌. ఈ లెక్క ప్ర‌కారం మ‌నిషి దేవుడిని త‌ల‌చుకునేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి., చివ‌రి రెండు సున్నాలు తీసివేసి 108ను ప్రామాణికంగా ఉంచార‌ని కొంత మంది పెద్ద‌లు చెబుతుంటారు.

కామెంట్‌లు లేవు: