25, నవంబర్ 2023, శనివారం

 మనిషి జీవితం రాగబంధాలతో కూడింది. రజోగుణమే రాగం. స్థూలంగా చెప్పాలంటే- ఇది నాది, వీరు నా వారు, ఇది నా ఆస్తి మొదలైన మమకారాలతో కూడిన భావమే రాగం. అది ఉన్నచోట ద్వేషం కూడా ఉంటుంది. సమాజంలో కొందరిని తనవారిగా భావించినప్పుడు, మరికొందరు పరాయివాళ్లుగా మారతారు. తనవాళ్ల కోసం పాటుపడే సమయంలో పరులను పక్కన పెట్టడం వల్ల సమాన దృష్టి కొరవడుతుంది. ఇలా తనవాళ్ల పట్ల పెరిగిపోయే అనురాగాలు మనిషిని బంధిస్తాయి. ఎప్పుడూ తనకోసం, తనవాళ్ల కోసం తపించడంలోనే శక్తియుక్తులన్నీ కర్పూరంలా హరించుకుపోతాయి. ఇలాంటి భావబంధాలను, భవబంధాలను తొలగించుకొమ్మని చెబుతుంది వేదాంతం.


అసలు మనిషి ఆయుర్దాయమే అతి స్వల్పం. నిండు నూరేళ్లు బతకడమే ఎంతో కష్టం. ఆ నూరేళ్లలోనూ బాల్యక్రీడలతో బాల్యం హరించుకుపోతుంది. చదువుసంధ్యలతో కౌమారదశ ముగిసిపోతుంది. విషయసౌఖ్యాలతో యౌవనం మాయమవుతుంది. నిరంతర చింతతో వృద్ధాప్యం గడుస్తుంది. అర్ధభాగం నిద్రకు, అర్ధభాగం ఇతర వ్యవహారాలకు ఆహుతి కాగా మనిషి ఆత్మానందం కోసం ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నాడనేది ప్రశ్నార్థకమే. అందుకే శంకర భగవత్పాదులు చర్పటపంజరికా స్తోత్రంలో ‘ఓ మూఢమతీ! గోవిందుణ్ని భజించు! నీ కాలం మూడినప్పుడు నిన్ను ఆ గోవిందుడు తప్ప ఎవరూ కాపాడలేరు. నీవు చదివిన వ్యాకరణ శాస్త్రం నిన్ను అంత్యకాలంలో కాపాడదు. కనుక శాస్త్రాలు వల్లెవేయడం కాదు, సాధనతో భగవంతుడికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించు’ అన్నారు.


మనిషి జన్మించే సమయంలో ప్రసవవేదనను కలిగించి తల్లిని కష్టపెడతాడు. పుట్టిన తరవాత పెరిగేదాకా తల్లితో సేవలు చేయించుకుంటాడు. పెరిగి పెద్దవాడైన నాటినుంచి సాంసారిక బంధాల్లో అష్టకష్టాలు అనుభవిస్తాడు. అనారోగ్యాలతో, ఆపదలతో దుర్భరంగా కాలాన్ని వెళ్ళదీస్తాడు. అందుకే శంకరభగవత్పాదులు- ఈ సంసారం ‘దుస్తారం’ (అతికష్టంతో దాటదగిన సముద్రం). కనుక ఓ మురారీ! నన్ను కాపాడు!’ అని ప్రార్థించారు.


చీకటిలో నడుస్తున్నవాడికి దారి తెలియదు. అజ్ఞానాంధకారంలో తిరిగేవాడికి జ్ఞానోదయం కానే కాదు. జ్ఞానకాంతికోసం వెదకాలి. చీకటిలో చిరుదివ్వెను వెలిగించాలి. మృత్యువు నుంచి అమృతత్వాన్ని తోడుకోవాలి. అదే మనిషి చేయవలసిన పని. నేనెవరు, నీవెవరు... అందరిలోనూ ఉన్న ఆత్మ ఎవరు, లోకంలో శాశ్వతంగా నిలిచేదేమిటి? ఏది నశించేది, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఈ ప్రశ్నలు ఉదయించాలి. వాటికి సమాధానాల కోసం అన్వేషించాలి. అదే నిజమైన జీవితం!


ఈ ప్రపంచంలో మనిషి జీవితం ఒక కల వంటిది. ‘కల’ ఎలా కొంతసేపు మురిపించి, నిద్ర మేల్కొన్న తరవాత కనబడకుండా పోతుందో అలాగే ఈ ప్రపంచం కూడా కొన్ని యుగాల వరకే పరిమితం. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండదు. అదే వేదాంత భావన.

ప్రపంచమే అశాశ్వతమైనప్పుడు ప్రపంచంలో కొంతకాలమే బతికి ఉండే మనిషి అశాశ్వతుడే కదా! అశాశ్వతమైన ఈ మానవజన్మను శాశ్వతానందాన్ని కలిగించే విషయాల కోసం ఉపయోగించాలే కానీ, క్షణిక సౌఖ్యాల కోసం వినియోగిస్తే ఇక సార్థకత ఎలా ఉంటుంది?.. ఆదిత్యయోగీ..


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి.  తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి...


ఇప్పుడైతే ఈ మొత్తం ప్రపంచానికి తెలుసు, పరమాత్మ ఒక్కరే, ఆ పరమాత్మను కొందరు శక్తి అని నమ్ముతారు, కొందరు ప్రకృతి అని అంటారు కావున ఏదో ఒక రూపంలో తప్పకుండా వారిని నమ్ముతారు. ఏ వస్తువునైతే నమ్ముతారో, తప్పకుండా ఆ వస్తువు ఏదో ఉంటుంది, అప్పుడే దానికి పేరు ఉంటుంది కానీ ఆ ఒక్క వస్తువు గురించి ఈ ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి, కానీ వస్తువైతే ఒక్కటే ఉంటుంది. అందులో ముఖ్యంగా నాలుగు అభిప్రాయాలను వినిపిస్తారు - కొందరు ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని అంటారు, మరికొందరు బ్రహ్మమే సర్వత్రా ఉంది అని అంటారు, సర్వత్రా బ్రహ్మమే బ్రహ్మము అని అంటారు. కొందరు ఈశ్వరుడు సత్యము, మాయ మిథ్య అని అంటారు, మరికొందరు ఈశ్వరుడు లేనే లేరు, అంతా ప్రకృతేప్రకృతి అని అంటారు. వారు ఈశ్వరుడిని నమ్మరు. ఇప్పుడు ఇన్ని అభిప్రాయాలు ఉన్నాయి. జగత్తు అంటే ప్రకృతి, అంతేకానీ, ఇంకేమీ లేదు అని వారు భావిస్తారు. ఇప్పుడు చూడండి, జగత్తును నమ్ముతారు కానీ ఏ పరమాత్మ అయితే జగత్తును రచించారో, ఆ జగత్తు యొక్క యజమానిని నమ్మరు! ప్రపంచంలో ఎంతమంది మనుష్యులైతే ఉన్నారో, వారివి అన్ని మతాలు ఉన్నాయి, చివరికి ఈ మతాలన్నింటి యొక్క నిర్ణయం స్వయం పరమాత్మ వచ్చి తీసుకుంటారు. ఈ మొత్తం జగత్తు గురించి పరమాత్మ వచ్చి నిర్ణయము తీసుకుంటారు లేక ఎవరైతే సర్వోత్తమునిగా, శక్తివంతునిగా ఉంటారో, వారే తమ రచన యొక్క నిర్ణయాన్ని విస్తారపూర్వకంగా అర్థం చేయిస్తారు, వారే మనకు రచయిత యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు మరియు తమ రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు... ఆదిత్యయోగీ...


చాలామంది మనుష్యులు ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు, మనము ఆత్మలము అని మనకు ఋజువు ఏమిటి. ఇప్పుడు దీనిపై అర్థం చేయించడం జరుగుతుంది, మనం ఎప్పుడైతే, ఆత్మనైన నేను ఆ పరమాత్ముని సంతానాన్ని అని అంటామో, ఇప్పుడు ఇది తమను తాము ప్రశ్నించుకునే విషయము. మనం రోజంతా ఏదైతే నేను, నేను అని అంటూ ఉంటామో, అది ఏ శక్తి మరియు ఎవరినైతే మనం స్మృతి చేస్తామో వారు మనకు ఏమవుతారు? ఎప్పుడైనా ఎవరినైనా స్మృతి చేసేటప్పుడు తప్పకుండా ఆత్మలమైన మనకు వారి ద్వారా ఏదో కావాలి, అన్ని వేళలా వారి స్మృతి ఉండడం ద్వారానే మనకు వారి ద్వారా ప్రాప్తి కలుగుతుంది. చూడండి, మనుష్యులు ఏదైతే చేస్తారో తప్పకుండా మనసులో ఏదో ఒక శుభమైన కోరిక ఉంటుంది, కొందరికి సుఖం యొక్క, కొందరికి శాంతి యొక్క కోరిక ఉంటుంది కావున ఎప్పుడైతే కోరిక ఉత్పన్నమవుతుందో, తప్పకుండా అప్పుడు తీసుకునేవారు ఎవరో ఉంటారు మరియు ఎవరి ద్వారా ఆ కోరిక పూర్తవుతుందో తప్పకుండా ఇచ్చేవారు ఎవరో ఉంటారు, కావుననే వారిని స్మృతి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రహస్యాన్ని పూర్తి రీతిలో అర్థం చేసుకోవాలి, వారు ఎవరు? ఈ మాట్లాడే శక్తి స్వయం నేను ఆత్మను, దాని ఆకారము జ్యోతిర్బిందువు వలె ఉంటుంది, మనుష్యులు స్థూల శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. అది ఈ కనులకు కనిపించదు, ఇప్పుడు దీని ద్వారా నిరూపించబడుతుంది, ఆత్మకు స్థూల ఆకారం లేదు కానీ మనుష్యులు ఆత్మ వెళ్ళిపోయిందని తప్పకుండా అనుభవం చేసుకుంటారు. మనం దానిని ఆత్మ అనే అంటాము, ఆత్మ జ్యోతి స్వరూపము, మరి తప్పకుండా ఆ ఆత్మకు జన్మనిచ్చేటువంటి పరమాత్మ రూపం కూడా ఆత్మ రూపం వలె ఉంటుంది, ఎవరు ఎలా ఉంటారో వారి సంతానము కూడా అలాగే ఉంటుంది. మరి ఆత్మలమైన మనం ఆ పరమాత్మను, వారు ఆత్మలమైన మనందరి కన్నా శ్రేష్ఠమైనవారు అని ఎందుకంటాము. ఎందుకంటే వారిపై మాయ యొక్క ఎటువంటి ప్రభావం ఉండదు. ఇకపోతే, ఆత్మలమైన మనపై మాయ యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మనం జనన మరణాల చక్రంలోకి వస్తాము. ఇప్పుడు ఇదే ఆత్మ మరియు పరమాత్మకు మధ్యనున్న వ్యత్యాసము...


ఎవరు ఉన్నా లేకపోయినా మన దారి మనం సాగిస్తూనే ఉండాలి గమ్యం చేరేదాకా....

గమ్యం కోసం పయనిస్తూ ఉంటాను... 

ఎదురుపడిన కొందరు ఆత్మీయులను 

చీమల బారులా నాతో పాటు కలుపుకుంటాను.. 

నా త్రోవలో నాతో పాటే నడిచే బంధాలు కొన్ని ... 

మధ్యలో వేరే చీమల బారులో కలిసిపోయే బంధాలు కొన్ని..

పుట్టినపుడు ఏకాకినే 

పోయేటపుడు ఏకాకినే 

మద్యలో నేను అల్లుకున్న పూల పొదరిల్లు 

ఎంతగా పరిమళిస్తుందో

ఎదుటి వారి హృదయాలను దోచుకుంటుందో 

అదే నేను సద్వినియోగపరచుకున్న నా జీవితపు విలువ...


"మనసు శూన్యస్థితికి చేరాలంటే ఏమి చెయ్యాలి ?"

"ఏకాగ్రతను అలవర్చుకోవాలి. మనసుకు కుదురు రావటం అంటే మనకు కుదురు రావటమే. మనమూ మనమనస్సు విడివిడిగా లేవు. నేను కదలకుండా ఉన్నానంటే నా మనసు కదలకుండా ఉందని అర్ధం. నేను కదులుతున్నానంటే నా మనస్సు చంచలంగా ఉందని అర్ధం. మనసు అంటే మనకి ఏర్పడిన జ్ఞాపకాల సమూహం. ఆ జ్ఞాపకాలు గుర్తుకురావటమే మనం నిరంతరం చేస్తున్న ఆలోచన. నిజానికి మనం కళ్ళు ముసుకున్నా కనిపించేవన్నీ బయట చూసినవే. మనకి చూడటం, వినటం ప్రవృత్తిగా ఉంది. జ్ఞాని మనసు నివృత్తిలో ఉంటుంది. కాబట్టే జ్ఞాని కళ్ళు మూసుకుంటే శూన్యం ఉంటుంది. అలాంటి శూన్యస్థితి కలిగే వరకూ మనసుకు ఏకాగ్రత అలవరుస్తూ వెళ్ళటమే సాధన. మనశ్శాంతి కోసం మొదలైన సాధన పరిణామంలో దైవం కోసం పడే తపనగా మారుతుంది !..

.


శరీరము, మనసుతో బాటు ఆత్మను కూడా ఆరాధించే వ్యక్తి యొక్క దృష్టి శరీరమూ, మనస్సు పైననే గాక, ఆత్మపై కూడా ఉంటుంది. కానీ ఆత్మ యొక్క ప్రయోజనం అతడికి తెలియదు. అతడు జాగ్రత్తదావస్థ, స్వప్న, సుషుప్తి అనే ఈ మూడు అవస్థల్లో చేసే పనులన్నీ చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పటికీ, ఆత్మ తత్వమూ, ఆత్మను గురించిన పరమసత్యమూ అతడికి తెలియదు. అందువల్లనే అతడు అజ్ఞాని, అతడి స్థితి అటువంటిది.....

కామెంట్‌లు లేవు: