5, డిసెంబర్ 2023, మంగళవారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 21*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కులచ్చిరై నాయనారు*


మణ మేక్కుడి అనే అందమైన గ్రామంలో గొప్ప శివభక్తుడైన

కలచ్చిరైయారు జన్మించాడు. నిరంతరమూ శివభక్తిలో లీనమై యున్న

అతడు పాండ్య చక్రవర్తికి ప్రధానమంత్రిగా ఉండేవాడు.


శివుని అనుగ్రహం పొందాలంటే శివభక్తులకు సేవ చేయాలనే

విషయాన్ని గ్రహించిన కులచ్చిరైయారు శివభక్తులు తనకు ఎదురైతే వారి

పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. వాళ్లు ఏ కులానికి చెందిన

వారైనా ధనవంతులైనా పేదవారైనా అందరినీ సమానంగా భావించేవాడు.


శివభక్తులు సమూహంగా వచ్చినా, లేక ఒక్కరే వచ్చినా వారిని సంతోషంగా ఆహ్వానించి, వారిని అతిథి మర్యాదలతో సంతృప్తి

పరుస్తుండేవాడు. పాండ్య చక్రవర్తికి అమాత్యులుగా ఉన్న కులచ్చిరైయారు

దేశాన్ని శత్రువుల బారి నుండి సంరక్షిస్తూ వచ్చాడు. 


శైవమతం అభివృద్ధి

చెందడానికి కారణమైన మంగయర్ క్కరసి రాణిగారి శైవభక్తి సేవలకు

నిజమైన సేవకుడుగా ఉంటూ శివభక్తులను ఆదరిస్తూ వచ్చాడు. తిరుజ్ఞాన

సంబందరు తిరుచరణాలను తన శిరసున ధరించిన మహానుభావుడితడు.

సుందరమూర్తి నాయనారుచే 'తిరుతొండ తొగై’ గ్రంథంలో 'పెరునంబి’

అని కీర్తింపబడ్డ శివభక్తుడు కులచ్చిరైనాయనారు.

*ఇరవై ఒకటవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: