15, డిసెంబర్ 2023, శుక్రవారం

🚩శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 116*


*మృత్యువు ఒడిలో*


స్వామీజీ విపరీతమైన జ్వరంతో బాధపడుతూ కనిపించారు. జ్వరంతోపాటు గొంతువాపు నొప్పి (diphtheria)  కూడా ఆయనకు సోకింది. అక్కడ వైద్య సౌకర్యాలు మృగ్యం. ఆదరణ కరవయిన పరిస్థితిలో భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మరోమార్గం ఏదీ వారికి కనిపించ లేదు. స్వామీజీ నాడి బలహీనంగా కొట్టుకొంటూ క్రమక్రమంగా ఆగిపోయే స్థితికి దిగజారింది; శరీరం చల్లబడసాగింది. అందరికీ నమ్మకం పోయింది; వారు విలపించనారంభించారు. 


హఠాత్తుగా అప్పుడు ఎక్కడ నుండో ఒక సాధువు అక్కడకు వచ్చాడు. తన సంచీ నుండి కాస్త తేనె, కొన్ని భస్మాలు తీసి, వాటిని తేనెలో రంగ రించి స్వామీజీ నోట్లో పోశాడు. సంజీవనిలా పనిచేసింది ఆ ఔషధం. కాసేపటి కల్లా స్వామీజీ శరీరం వేడెక్కింది, స్పృహ కూడా వచ్చింది.


మరికొంతసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి మెల్లగా మాట్లాడారు. కాని. మాటలు స్పష్టంగా లేకపోవడంతో ఒక సోదర సన్న్యాసి ఆయన నోటి వద్ద తన చెవిని ఆనించి మాటలు జాగ్రత్తగా విన్నాడు. 'సోదరులారా చింతించకండి. నేను చావును" అన్నారు స్వామీజీ.


బయటికి స్వామీజీకి వచ్చిన జ్వరం మృత్యుముఖం దాకా తీసుకువెళ్లినప్పటికీ, అంతరికంగా అది ఆయనకు ఒక అద్భుత సందేశాన్ని అందజేసింది. ఆ అర్ధబాహ్య చైతన్య స్థితిలో ఆయన కొక మహాసత్యం ఆవిష్కృతమయింది. తాను ఈ లోకంలో నిర్వర్తించవలసిన మహత్కార్యం ఒకటి ఉంది. ఆ కార్యం పూర్తయ్యే దాకా విశ్రాంతి అన్నదే లేదని ఆ సమయంలో తనకు తెలిసినట్లు స్వామీజీ తదనంతరం చెప్పారు. 


ఆయనలో అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి ఉప్పొంగడం సోదర సన్న్యాసులు గమనించకపోలేదు. ఆ శక్తి కార్యోన్ముఖమవడానికి తగిన సమయం కోసమూ, చోటు కోసమూ వేచివున్నట్లుగా తోచింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: