10, జనవరి 2024, బుధవారం

శ్రీదేవీభాగవతము

 శ్రీదేవీభాగవతము

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


పరమపవిత్రుడా ! విశ్వామిత్రుడా! అదంతా నీకు చెప్పి ఏమి ప్రయోజనం ? అనవసరంగా

నువ్వూ దుఃఖించవలసివస్తుంది.

హరిశ్చంద్రా ! అక్రమంగా ఆర్జించిన అపవిత్రధనమైతే నేను దీన్ని ముట్టను. ప్రశస్తమైనదే

స్వీకరిస్తాను. అందుకోసం అడుగుతున్నాను. ఎలా సంపాదించావో చెప్పు.

మహర్షీ! నా భార్యను కోటి నిష్కాలకు అమ్మేశాను. పుత్రుణ్ణి అర్బుదనిష్కాలకు విక్రయించాను

ఇవిగో మొత్తం పదకొండుకోట్ల సువర్ణటంకాలు. స్వీకరించు.

హే రాజన్ ! స్వీకరించు, స్వీకరించు అంటున్నావు. బోడి పదకొండుకోట్ల చిల్లరవాణేలు

రెండున్నరబారువు లవుతాయనుకుంటున్నావా? నువ్వు ఇస్తానన్న దక్షిణ ఎంతో మరిచిపోయావా? వాళ్లకు 

తూకాలూ కొలతలూ తెలియవనుకుంటున్నావా? ఇవి సరిపోవుగాక సరిపోవు. మరిన్ని పంపాదించు.

మసిబూసి మారేడుకాయ చేద్దామని చూశావో నా తపోబలం రుచిచూస్తావు. నా స్వచ్ఛశీలమూ నా

అధ్యయనమూ ఎంతటివో తెలుసుకుంటావు.

మహాత్మా! తక్కినదికూడా తప్పకుండా సంపాదించి ఇస్తాను. కాకపోతే మరికొంతకాలం గడుపు

పెంచు. పత్నీపుత్రులను అమ్మినది ఇప్పుడేకదా!

హరిశ్చంద్రా! గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకి ఇంకా నాల్గవభాగం మిగిలి ఉంది. ఆది

ముగిసేలోగా నువ్వు సంపాదించడమూ నాకు చెల్లించడమూ అవ్వాలి. అంతకుమించి క్షణం ఆగము. ఇకనువ్వు ఏమీ చెప్పకు. నేను వినను.

కామెంట్‌లు లేవు: