28, జనవరి 2024, ఆదివారం

కొడుకే మోక్షకారకుడా?

: కొడుకే మోక్షకారకుడా?


కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై/

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్/

బడసెన్: పుత్రులులేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్/

చెడునే మోక్షపదంబపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి;


భావము:-లోకంలో జీవనభ్రాంతిలోమునిగిన జనం "అపుత్రస్య గతిర్నాస్తి"-యను వాక్యము నూతగొని సంసారమగ్నులై మోక్షపథమునకు దూరమగుచున్నారు.యదార్ధమునకు సంతానము మోకషపదమునకు సహకారమనుట యసత్యము.

       ధృతరాష్ట్రునకు నూర్గురు కుమారులుగలిగిరి వారివలన అతనికి గలిగిన సద్గతులెవ్వి?

ఆజన్మబ్రహ్మచారియైన శుకునకు సంతతిలేకపోవుటచేకలిగిన దుర్గతులేవి?

      సంతతి లేకుండుట మోక్షపదమునకు అవరోధము యెంతమాత్రముకాదు.అదియొకభ్రమ!

కేవలమూ పరమేశ్వరానుగ్రహమే సద్గతికి మూలము.


                           స్వస్తి!🙏

కామెంట్‌లు లేవు: