6, జనవరి 2024, శనివారం

భక్తిసుధ

 🪷🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*తరుణా రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ*।

 *పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ॥*


*ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణా౹*

*పుక్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణా॥*


*శరణ్యా సర్వసత్త్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతామ్౹*

*రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ॥*


- *శ్రీ రామరక్షా స్తోత్రం - 17, 18, 19*


*తా* 𝕝𝕝  

మంచి వయో రూప సంపదలు గలవారు మహా బలశాలులు, సుకుమారులు, పద్మములవంటి విశాల నేత్రాలు గలవారు, నారబట్టలు, లేడిచర్మములే వస్త్రములుగా ధరించినవారు, కందమూల ఫలములను ఆహారముగా గ్రహిస్తూ, తాపసులై, బ్రహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు పుత్రులు, సమస్త ప్రాణులకు శరణ మిచ్చువారు, రాక్షసులను సమూలముగా నశింప చేయువారు, *రఘువంశ శ్రేష్ఠులైన రామ లక్ష్మణులు మనలను రక్షింతురుగాక*.



           తరుణ వయస్సు కలవారు, రూపంలో అతి సుందరులు బలపరాక్రమలు, కమలములవంటి విశాలమైన నేత్రాలు కలవారు, నారచీరలను, కృష్ణమృగ చర్మాలను ధరించి, కంద మూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు, మహా తపస్వులు, శరణు నిచ్చువారు, శ్రేష్ఠ ధనుర్ధారులు, రాక్షసులను నశింపచేయువారు అయినా *రామలక్ష్మణులు మమ్ములను రక్షింతురుగాక*.



          యువకులు, అపురూప సుందరమూర్తులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు, కృష్ణాజినము (జింక చర్మము)ను ధరించినవారు, కందమూలములను ఆహారముగా తీసికొనువారు, తాపసవృత్తిలో ఉన్నవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు, బ్రహ్మచారులు, దశరథ మహారాజు పుత్రులు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు, సకల జీవరక్షకులు, ధనుర్దారులలో కెల్ల శ్రేష్ఠులు, రాక్షస జాతిని నశింప చేయువారు, రఘుకుల శ్రేష్ఠులు అగు *శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక*.

కామెంట్‌లు లేవు: