23, జనవరి 2024, మంగళవారం

నేతాజీ జయంతి

 ॐ          నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటూనే, గాంధీ, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, 

   "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించిన ధైర్యమూ, రాజీనామా చేసిన ఆయన త్యాగమూ మన యువతకు అలవడితే, 

   మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 

    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం.  


* సోమనాథ్ దేవాలయం పునర్నిమించుకొన్న ఏడు దశాబ్దాల అనంతరం, 

    అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ అయిన ఈ శుభ సందర్భంలో దేశప్రజల ఆనందం ద్వారా 

   "నేతాజీ" కలలుగన్న "స్థిరమైన హిందూ భారతదేశం" స్థిరమవుతోంది కదా! 


                     జై హింద్ 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: