7, ఫిబ్రవరి 2024, బుధవారం

సూర్యారాధన

 మాఘ మాసంలో సూర్యారాధన


తేటగీతి పద్యము 


మాఘమునరథసప్తమి, మగువలంత

వేడుకగనుజరుపుచుండు, వీధులందు

రథముముగ్గువేయుదురిక రమ్యముగను

 పాయసమువండియు పరమ భక్తితోడ

రవికి నైవేద్యమును పెట్టు రమణులంత



సాహితీ శ్రీ జయలక్ష్మి

: గౌరీశంకర లను స్తుతిస్తూ సీస పద్యం


సీ. శ్రీపార్వతీవరా ! శ్రితజన మందార !

                శ్రీకర ! సుందరా ! శ్రీగిరీశ !

     రాజరాజేశ్వరీ ! రజతాద్రి వాసిని

                పాలించు సతతంబు భవుని రాణి!

     వేద మంత్రాకార ! విశ్వ సంరక్ష కా !

                శివకామసుందరీ చిత్తచోర !

     అగ్నిలింగాకార ! అరుణాచలేశ్వరా !

                ఆర్త జనోద్ధార ! యహి విభూష !

తే. రమ్ము మముగావ పరమేశ ! రమ్యదేహ ! 

      నిన్ను నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

      పార్వతీ నాథ ! శంకరా !పరమపురుష!

      శశిధరా ! యీశ ! గౌరీశ ! శరణు శరణు !


జయలక్ష్మి

కామెంట్‌లు లేవు: