1, మార్చి 2024, శుక్రవారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే*

*శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ*

*స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ*

*ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే.*


జనార్ధనా! నీవు బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మాన్ని నాభియందు ధరించినవాడవు. సంసార దు:ఖాన్ని హరించివేస్తావు. పరమాత్మవు. నీవు ధరించిన పట్టువస్త్రం పద్మాలలోని కింజల్కాల పసిమివన్నెతో అత్యంతము, నిర్మలమై, దివ్యమై నవ్యమై ఒప్పారుతూ ఉంటుంది. నీ పాదాలు పద్మాలవలె కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. నీవు మెడనుండి పాదాలవరకూ ధరించే వనమాల మనోజ్ఞమైన తమ్మిపూలతో నిండి చూచేవారికి చూడముచ్చటగా ఉంటుంది. నీవు ఇంద్రుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారికంటె మహాత్ముడవు. సృష్టిలో ఉండే సుగుణాలన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఒప్పారుతున్నాయి. మ్రుక్కడి రక్కసులను చంపివైచి సాధువులను సంరక్షిస్తూ ఉంటావు.నీవు బ్రహ్మదేవునకు కూడా తండ్రివి. అట్టి నీకు వేలకొలది నమస్కారాలు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: