29, మార్చి 2024, శుక్రవారం

అంతర్యామి

 🔱 అంతర్యామి 🔱


# ప్రేమే దైవం 


🍁ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది.


వేదవాఙ్మయం అంతా ప్రేమనే ప్రబోధిస్తుంది. సకల జీవుల ఐక్యతకు ప్రేమే మూలమని పురాణాలు కూడా చెబుతున్నాయి. శ్రీరాముడు సర్వులనూ ప్రేమించాడు. వారితో అనుబంధం పెంచుకున్నాడు. పశుపక్ష్యాదులనూ ప్రేమించాడు. అలాగే శ్రీకృష్ణుడు నమ్మినవారందరినీ ఆదుకున్నాడు. గోవులనూ ప్రేమతో కాపాడి గోపాలుడయ్యాడు. ప్రేమ భగవత్ స్వరూపం. ఆ ప్రేమ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నిస్వార్ధ సేవకు దారి చూపుతుంది. పరస్పర సహకారానికి పునాది వేస్తుంది. మనుషుల మధ్య సఖ్యతకు రెండక్షరాల ప్రేమ వారధిగా నిలుస్తుంది


🍁నిజానికి మనిషిని మనిషిగా చూసేదే అసలైన ప్రేమ ప్రేమ నిండిన ఒక మాట గాయపడిన హృదయానికి సాంత్వన కలిగిస్తుంది. నిరాశ నిండిన మనసులో ఆశలు రేకెత్తిస్తుంది. ఆర్థిక సంబంధాలు, కులమతాలు, బాహ్యసౌందర్యం, ఆడంబరాలు... ఇలా దేనితోనూ సంబంధం లేకుండా. ఇచ్చిపుచ్చుకొనేదే నిజమైన ప్రేమ. అందుకే ప్రేమను పొందడం కాదు, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి.


🍁స్వచ్ఛమైన ప్రేమంటే ఎదుటివ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేది కాదు. ఆ వ్యక్తి కష్టాల్లో, బాధలలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వగలగాలి. అదే మనిషికి కొండంత ఓదార్పున వి ఇస్తుంది. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా: అండగా ఉండేవారే స్వచ్చమైన ప్రేమను అందించే నిజాయతీపరులు. వారే అసలైన ప్రేమికులు. మనిషి ఆనందంగా, సజావుగా మనుగడ సాగించాలకున్నప్పుడు అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. మూగజీవుల పట్ల దయతో వ్యవహరించాలి. వాటికి ఆహారం పెట్టి. వాటి దాహార్తిని తీర్చాలి. అప్పుడే మనల్ని ప్రేమించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.


🍁పసిపాపలోని వెల్లివిరిసిన అమాయకమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమను మనం ఎదుటివారిపై చూపించగలిగితే ఈ మాయా మోహా జగత్తులో అజాతశత్రువులుగా మనగలుగుతాం. ప్రేమ జీవననావకు ఓ చక్కని చుక్కాని కాగలదు అంటారు పెద్దలు.


🍁ప్రేమ ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి. ఈ స్థితిని పొందినవారు తమకు అపకారం చేసినవారికి కూడా ఉపకారం చేసే విశాల హృదయం కలిగి ఉంటారు. వారికి ఈ ప్రపంచంలో అందరిపట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. ప్రేమకు మరో రూపం దయాగుణం. బాధలలో ఉన్నవారిని కారుణ్యంతో ఆదుకుంటే అది వారి వేదనను దూరం చేస్తుందని బుద్ధుడు తన ం శిష్యురాలైన ఆమ్రపాలికి ఉపదేశిస్తాడు. ప్రేమంటే ఓ ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. చెట్టు తన కొమ్మలను నరికే వ్యక్తికైనా చల్లని నీడను ఇచ్చినట్లుగా, ఏదీ ఆశించకుండా పువ్వు పరిమళాలు అందించినట్లుగా మనిషి కూడా దూషణ, భూషణ, తిరస్కారాలు లెక్కచేయకుండా అందరికీ ప్రేమను పంచాలి. సర్వజీవుల్లోనూ దేవుడున్నాడనే సత్యాన్ని గ్రహించాలి. తన ప్రేమను తోటి జీవులకు,

మనుషులకు మాత్రమే పరిమితం చేయకుండా

పశుపక్ష్యాదులకూ ప్రేమను అందించాలి. ప్రేమే దైవి

దైవమే ప్రేమ అని విశ్వసించాలి.🙏


-✍️ జై శ్రీ రామ్

కంచెర్ల వెంకట రమణ 


⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

శ్రీ రామ జయ రామ జయజయ రామ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: