2, మార్చి 2024, శనివారం

ఆభరణం

 🙏🙏🙏

********

              **శుభోదయం**

                        ***

**మానవుని యొక్క ఆభరణం రూపం. రూపం యొక్క ఆభరణం గుణం. గుణం యొక్క ఆభరణం జ్ఞానం, జ్ఞానం యొక్క ఆభరణం క్షమ. ఇది కల్గిన వారు సర్వత్రా శ్రేష్టులుగా చెప్పవచ్చును.**

                     ***

 ""సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి:పత్నీ క్షమా పుర: షడేతే మమ బాంధవా""

                      ***

**ఆత్మ బంధువులు ఆరుగురున్నారు మనకు. అవి సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమాగుణం. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో సత్యాన్ని అంతగా ప్రేమించాలి. తండ్రిని ఆరాధించినట్లే జ్ఞానాన్ని సంపాదించాలన్న తృష్ణను కలిగి ఉండాలి. ధర్మాన్ని సోదరునిగా ఎంచాలి. దయను ప్రియనేస్తంగా భావించాలి. శాంతిని భార్యలా, క్షమను పుత్రునిలా భావిస్తూ ఆ గుణాలతో మమేకం కావాలి. పరిపక్వమైన వ్యక్తిత్వం అంటే అదే! ఆప్తులవల్ల కూడ ఒక్కోసారి మన మనసుకు బాధకలుగుతుంటుంది. అంత మాత్రావ వారిని మనం ప్రేమించకుండా ఉండలేం! అలాగే పై గుణాలవల్ల అప్పుడప్పుడు కొంత నష్టమో, కష్టమో కలిగినా సంతోషంతో స్వీకరించాలి తప్ప వాటిని వదులుకోవాలని భావించకూడదు.* 

*సన్మార్గాలు అనేవి ఎప్పుడూ మనలను పరీక్షించేవి, రక్షించేవీను. ఆ పరీక్షలకు తట్టుకుని నిలబడగలిగే మానసిక ధృడత్వాన్ని మనలో పెంపొందించుకోవాలి. చెక్కుచెదరని ధృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. అప్పుడు ఎవరైనా మన తీరుతెన్నుల్ని విమర్శించినా, ఎగతాళి చేసి మాట్లాడినా వాటి ప్రభావం మనపై పడదు. ఇతరుల విమర్శల వెనుక ఒక్కోసారి వారి అజ్ఞానమో, స్వార్ధపూరిత మనస్తత్వమో ఉంటుంది.**

*కనుక ఇతరుల విమర్శలకు కాకుండా ఆత్మవిమర్శకే అధిక* *ప్రాధాన్యతను ఇవ్వాలి.**

                        ***

             **ఇదం న మమ**

          **శుభప్రదమైన రోజు**

                        ***

**యం.వి.శర్మ**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: