25, ఏప్రిల్ 2024, గురువారం

లక్షణాలని బట్టి మన శరీరతత్వం

 లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం -


 * శరీరపు లక్షణం -


      వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.


 * శబ్ద లక్షణం - (నాడి లక్షణం ).


       వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ 

తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును . 


 * నేత్ర లక్షణం -


        వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.


 * మల లక్షణం - 


       వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.


 * ముత్ర లక్షణం -


         వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి 

మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.


                  ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .


                నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.


 * నాలిక యొక్క లక్షణం -


          నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .


             పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: