18, ఏప్రిల్ 2024, గురువారం

పరుశురాముడు

 కుశిక వంశంలోని గాధిరాజు కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని సోదరి సత్యవతి. ఋచీకమహర్షి సత్యవతి భర్త. అంటే విశ్వామిత్రుడు, సత్యవతి సోదర, సోదరీమణులు.


ఋచికుని యజ్ఞ ప్రసాదంవలన భార్య అయిన సత్యవతి , ఆమె యొక్క తల్లి ( అంటే విశ్వామిత్రుని తల్లి కూడా) ఒకేసారి గర్భం దాలుస్తారు. కానీ యజ్ఞపల ప్రసాదము తారుమారవుతుంది.

యజ్ఞ ఫల ప్రసాదము తారుమారవుటము

యజ్ఞ ప్రసాదం తీసుకున్న తర్వాత తెలుస్తుంది. 


ఫలితంగా క్షాత్రంతో పుట్టవలసినటువంటి కుమారుడు, గాధిరాజుకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఉద్భవిస్తాడని,తపస్వత్వం తొ పుట్టవలసినటువంటి కుమారుడు, సత్యవతికి క్షాత్రంతో ఉద్భవిస్తాడని ఋచీకమహర్షి చెప్తాడు.


అందుకు సత్యవతి వాపోతుండగా ఆమె ఋచీక మహర్షి ఆమెను అనునయం చేస్తూ, చిన్న సవరణ చేస్తాడు. ఆమె కుమారుడికి ఋషత్వం ప్రసాదించి, ఆమె మనవడికి క్షాత్రత్వం ప్రసాదింప చేస్తాడు. 


ఫలితంగా సత్యవతికి జమదగ్నిమహర్షి కుమారుడు గాను, జమదగ్ని మహర్షికి కుమారుడుగా పరుశురాముడు ఉద్భవిస్తారు.

కామెంట్‌లు లేవు: