7, మే 2024, మంగళవారం

టైంపాస్

 ప్రతిరోజూ యిదే ప్రశ్న!! రిటైర్ అయ్యావుగా టైంపాస్ ఎలా అవుతోంది? 

అసలు ఇదేం ప్రశ్న?! 

టెలివిజన్ చూస్తాను... 

పుస్తకాలు చదువుతాను. 

నా తెలివితేటలకు యిదో పెద్ద పనా? ఇంకా కావలస్తే వివరంగా నిన్న జరిగిన సంఘటన వివరిస్తాను. 


బంగారం షాపుకి నేను నా భార్యతో బజారుకు వచ్చాం.

షాపులో పనైపోయి అక్కడే  పక్కనున్న కారుదగ్గర ఆగాము.. నన్ను చూసిన పోలీస్ కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ...


పోలీస్ : ఇక్కడ కారు పార్కింగ్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టండి.

నేనూ : మేము లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా గడవలేదండీ

పోలీస్ : ప్రతి ఒక్కరూ అలానే చెపుతార్లేవయ్యా

నేను : సార్ నేను రిటైర్డ్ LFL HM ను. కనీసం నా వయసుకైనా మర్యాద యివ్వండి. 

పోలీస్ : సరే ఒక రెండు వందలు యివ్వండి

నేను : రశీదు యిస్తారా?

పోలీస్ : అదెలా కుదురుతుంది

నేను : యివ్వకపోతే ఎలా? చట్ఠప్రకారం రశీదు యివ్వాలి కదా

పోలీస్ : (బాగా ఇరిటేట్ అయ్యాడేమో) చట్టంగురించి నాకే చెప్తారా ! సరే చూడు ఈ కారుకి లెప్ట్ రేర్ వ్యూ మిర్రర్ పగిలి పోయింది. వెనుక నెంబర్ ప్లేటు సరిగా లేదు.. మొత్తం నాలుగు వేలు కట్టు.


నేను నిస్సహాయంగా నా భార్య వైపు చూసాను. 

ఆమె వాదులాట మొదలు పెట్టింది.   

అర గంటకు పైగా అన్నిరకాలుగా వాదన జరుగుతూనే వుంది. 


అప్పుడు వచ్చింది మేం ఎక్కవలసిన సిటీ బస్సు. 

వెంటనే ఆ బస్ ఎక్కేశాం..😜😀

పోలీస్ అలాగే మావైపు బిత్తరచూపులు చూస్తున్నాడు..


కారు నాది కాకపోయినా టైంపాస్ ఎంత బాగా అయిందో చూశారుగా! 😁😅

ఇలాంటివి కొన్ని వందలుంటాయి.

రిటైర్ అయ్యాక టైంపాస్ కాదని ఎవరూ చెప్పింది ... 

😄😆😂🤣

కామెంట్‌లు లేవు: