14, మార్చి 2025, శుక్రవారం

అగ్నిమీళే పురోహితం

 . అగ్నిమీళే పురోహితం అని ఋగ్వేదంలో ప్రథమ మంత్రం. 


పురోహితం - మొట్టమొదటగా మన హితాన్ని కలిగించేవాడు ఎవరో వారికి నమస్కారం. 


దీనికి మన ఇంటి పురోహితుడు అని అర్థం కాదు. 


అగ్ని పేరు ఇంటి పురోహితుడికి పెట్టాంగాని, పురోహితుని పేరు అగ్నికి పెట్టలేదు.


మన శరీరం అనే పురంలో ఉంటూ మనకు హితం కలిగించేవాడే పురోహితుడు.


 నవద్వారే పురే దేహి తొమ్మిది ద్వారాల శరీరమనే పురంలో ఉంటూ దానికి హితం కలిగిస్తున్నవాడెవడో వాడు పురోహితుడు. వాడు అగ్ని.


అగ్ని అంటే అగ్రే నియతి ఇతి అగ్నిః - అన్నిటికంటె ముందు ఉన్నవాడు అని అర్థం. 


అన్నిటికంటె ముందు అంటే అర్ధం మన శరీరం కంటె, మన బుద్ధి కంటే, మన ప్రాణాలకంటే, పంచభూతలింగాలకంటె ముందు ఎవరు ఉన్నారో వారి పేరు అగ్ని. అది పంచభూతాలలో ఒకటైన అగ్ని కాదు.


పంచభూతాలకీ కారణమైన చిదగ్ని. అది జ్ఞానాగ్ని.


 అది కేవల ఈశ్వరస్వరూపం. 


అలాంటి అగ్ని ముందు ఉంది. 


అతడే మన పురానికి హితం కలిగిస్తున్నవాడు అని అయన్ని ఉపాసించు అని శాస్త్రం మొదటి మంత్రంగా అగ్నిమీళే పురోహితం పెట్టింది.


 అక్కడ చెప్పబడ్డ అగ్నియే పరమేశ్వరుడు


. మహాగ్నిలింగం యొక్క తత్త్వమది. 


అది తెలుసుకుని 'అరుణాచల' అంటే తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్పారు.

కామెంట్‌లు లేవు: