రామం స్కందం హనూమంతం
వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం
దుస్వప్న-స్తస్యనాశ్యతి
అర్థం: ప్రతిరోజూ నిద్రపోయే ముందు రాముడు, స్కందుడు, హనుమంతుడు, గరుడుడు మరియు భీముడిని ప్రార్థించడం వల్ల కలలు కలగకుండా ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.
ఈ శ్లోకం చెడు కలలు మరియు పీడకలల నుండి రక్షణ పొందడానికి పఠించబడే శక్తివంతమైన శ్లోకం. ఇది పూజనీయమైన దేవతలైన శ్రీరాముడు, కార్తికేయుడు (స్కందుడు), హనుమంతుడు, గరుడుడు మరియు వృకోదరుడు (భీముడు) ల ఆశీస్సులు లభిస్తాయి.నిద్రపోయే ముందు ఈ పేర్లను స్మరించే మరియు జపించే వారు చెడు కలల ప్రభావాల నుండి విముక్తి పొందుతారని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది.
వాల్మీకి ఆదికావ్యం శ్రీమద్రామయణం అనుష్టుప్ ఛందస్సులో ఉన్నది.
అనుష్టుప్ వృత్త ఛందస్సుల కన్నాపురాతనమైనది.
అనుష్టుప్ శ్లోకం వృత్త ఛందస్సు కాదు. ఇది వేద ఛందస్సు. కాని కావ్యాదులలో శ్లోకానికి, వేదాలలో వలె స్వరభేదం భేదం నిర్దేశం లేదు.
అనుష్టుప్ శ్లోకానికి ప్రతి శ్లోకానికి 8 అక్షరాలు కలిగి నాలుగు పాదాలు ఉంటాయి.
అనుష్టుప్ శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 5వ అక్షరము లఘువు, 6వ అక్షరము గురువు; ప్రధమ, తృతీయ చరణములందును దీర్షముగాను; ద్వితీయ,చతుర్ధ చరణములందు హ్రస్వముగాను కూడా ఉండును.
అన్ని అనుష్టుప్ శ్లోకాలకి ఈ నియమం లేదు. అక్షర సంఖ్య మాత్రమే ప్రధానము.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి