7, నవంబర్ 2025, శుక్రవారం

కార్తీకపురాణం - 17 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

     🍁 _*శుక్రవారం*_🍁

🕉️ *నవంబర్ 7, 2025*🕉️


*కార్తీకపురాణం  - 17 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

             

*ధన లోభికి తత్వోపదేశం*```


అప్పుడు అంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. “ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు.


“కర్మల వల్ల ఆత్మ దేహధారణ సంభవిస్తున్నది. కాబట్టి, శరీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా… 

ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు.


దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… “ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు.


అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు “ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత  వశిష్ట ప్రోక్త  కార్తీక మహాత్యమందలి*


  *పదిహేడవ అధ్యాయము*  

        *పదిహేడవ రోజు*

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

కామెంట్‌లు లేవు: