కాతే కాంతా కస్తే పుత్రః సంసారో య మతీయ విచిత్రః, కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదియ భ్రాతః
భజగోవిందంలో శంకరాచార్యులు చెప్పిన ఈ శ్లోకంలో అర్థం కంటే అంతరార్థం చాలా గొప్పది. భార్య ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలియదు. పోనీ పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు? అదీ తెలియదు.
భార్యాబిడ్డలే సంసారంగా భావిస్తారు కదా! ఈ జీవయాత్ర ఎప్పటికి ముగుస్తుంది? ఎన్నాళ్ళీ ప్రయాణం? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే.. తల్లి గర్భం నుంచి వచ్చానంటావు. అంతకంటే ముందు ఎక్కడున్నావు? ఎన్నాళ్లీ ప్రయాణం, ఎప్పటికి ఈ యాత్ర ఆగుతుంది- ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఈ జీవన సత్యాలు గ్రహించగలిగితేనే ఈ జన్మలో కాకున్నా.. తర్వాతైనా ఈశ్వర సన్నిధికి చేరుకోగలుగుతాం. శరీరంతో వచ్చిన సంబంధాలన్నీ ఆ దేహంతోనే అంతమవుతాయి.
కాలానికి ఉన్న గుణం.. నశింప చేయడమే!
శంకరులవారు- 'జగద్భక్షకః కాలం' అన్నారు. కాలం జగత్తును పుట్టిస్తుంది, తినేస్తుంది. కనుక కాలం ముందు తల వంచక తప్పదు. అయితే ఈ శరీరం ఉండగానే బ్రహ్మపదం పొందడానికి ప్రయత్నించాలి. కాలాన్ని గెలిచినవారు లేరు. కాలం ఈశ్వర స్వరూపమై చేసే హెచ్చరికలను జాగ్రత్తతో వ్యవహరిస్తూ గ్రహించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి