8, నవంబర్ 2025, శనివారం

కథ ఎలా రాయాలి

 కథ ఎలా రాయాలి ఈ విషయం మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన అభిప్రాయము అనుభవము కలిగి ఉంటారు నిజానికి ఒక కథ రాయాలంటే ముందుగా ఒక కథకు ఇది వృత్తాన్ని ఎంచుకోవాలి. అయితే అది జన సామాన్యంలో అయి ఉండాలి జనాలందరూ మెచ్చుకునేదై ఉండాలి అప్పుడే జనాలు ఆ కథ చదవటానికి ఎక్కువగా ఇష్టపడతారు కథలో కూడా కొంత చమత్కారము కొంత తెలివిగా మాట్లాడే విధానం ఉన్నట్లుగా చూపెడితే అది కూడా అందరికీ ఇష్టంగా ఉంటుంది ఏదో ఒక చిన్న సందేశం కథలో ఇచ్చే విధంగా ఉంటే అది లోకానికి ఉపయోగపడుతుంది కథలో కూడా ఎన్ని పాత్రలు ఉండాలి ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం నిజానికి కథ అనేది ఒకటి రెండు పేజీలు మటుకే ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత మటుకు తక్కువ పాత్రలు అంటే మూడు నాలుగు అంత మటుకు ఉంటే బాగుంటుంది కానీ మొత్తం కథ దాదాపుగా ఒకే ఒక పాత్ర మీద అంటే ఆ పాత్ర చుట్టూ తిరిగేటట్టుగా ఉంటే బాగుంటుంది అప్పుడు ఆ పాత్ర యొక్క గుణగణాలు ఆ పాత్ర యొక్క తెలివితేటలు అవన్నీ మనకు కథలు తెలుస్తాయన్నమాట ఒక హీరో ఉన్నాడు ఆ హీరోకి భార్య ఉంది ఆ హీరో భార్యతో ఎలా ఉంటాడు అదే ఆ హీరో ఆఫీసులో కూడా బాస్ ఉన్నాడు ఆ బాసుతో ఎలా ఉంటాడు ఆ హీరోకి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుతో ఎలా ఉంటాడు ఇక్కడ భార్యతో తనకున్నటువంటి సంబంధం వస్తువు అనుకున్నా సంబంధం కొడుకుతో తనకున్న సంబంధం వాళ్లతో తను ఏ విధమైనటువంటి పద్ధతిలో సంభాషిస్తున్నాడు వాళ్లతో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాడు వాళ్లతో ఎట్లా సంయమనం చేస్తున్నాడు తన జీవితానికి ఎలా మలచుకుంటున్నాడు అనే విషయాన్ని తీసుకొని ఒక కథలాగా రాయొచ్చు మనము అతనిలో ఉండేటువంటి తొందరపాటుతనము ఆత్రుత లేక భయము లేక మరేదైనా ఒక గుణాన్ని ఆసరాగా తీసుకొని దానికి ఎంత మటుకు వాళ్లు తోడుగా ఉంటున్నారు ఉదాహరణకు భార్యతో ప్రవర్తించేటప్పుడు భార్య మాటని గౌరవిస్తున్నాడా లేక భార్య మీద ఆధిపత్యం వహిస్తున్నాడా అనే అంశాన్ని మనం తీసుకోవచ్చు కుమారుడితో ప్రవర్తించేటప్పుడు కుమారుడుతో ప్రేమగా చనువుగా లేక కుమారుడిని దూరంగా చూస్తూ ఉన్నట్లుగా ఉంటున్నాడా అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఒక బాస్ తో మాట్లాడేటప్పుడు బాస్ అంటే భయపడుతున్నాడా లేకపోతే బాసుకు వ్యతిరేకంగా అంటే అడ్డదిడ్డమైనటువంటి విషయాలు తన మదిలో పెట్టుకొని భాషను ధిక్కరిచ్చే విధంగా పలకరిస్తున్నాడా బాస్ చెప్పిన పనులు చేస్తున్నాడా లేక చేయకపోతున్నాడా దానికి బాసు ఏ రకంగా స్పందిస్తున్నాడు ఇతని మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా ఆసరాగా హీరోకి ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తూ చెప్పవచ్చు ఈ రకంగా ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ఒక్కొక్క రకంగా రాయవచ్చు మీరు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు మీరు కామెంట్లో తెలియజేయండి 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 


సి భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: