ఈ వారంలో ఒక డాలర్ ధర ₹90చేరి వార్తల్లో నిలిచింది.
1947లో దాదాపు గా ₹3.30 ps పెడితే ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు అదే ఒక డాలర్ కొనాలి అంటే ₹90ఖర్చు చేయాలి.
1947 లో ₹3.30ps ఉన్నది నెహ్రూ గారు దిగిపోయే సరికి ₹4.76 పై. చెల్లించాల్సి వచ్చేది. అంటే దాదాపు 45% రూపాయి విలువ పడిపోయింది.
ఆ తర్వాత 5సం. లు పైబడి ప్రధానిగా చేసిన వారి కాలంలో డాలర్ తో రూపాయి విలువ ఎలా ఎంత శాతం పతనం అవుతూ వస్తోందో క్రింద చూడండి:
Period Dollar rate
from - to From-to %age increase
1947-64: 3.30=4.76 44.24% Nehru
1966-75: 4.76=8.38 76.05% Indira
1977-80: 8.74=7.86 -10.07% Indira
1980-84: 7.86=11.36 44.53% Indira
1984-89: 11.36=16.23 42.87% Rajiv
1991-96: 22.74=35.43 55.80% PV
1998-04: 41.26=45.32 9.84% ABV
2004-14: 45.32=62.33 37.53% MMS
2014- 25: 62.33=90.00 44.39% Modi
పై చార్ట్ చూస్తే ఏం అర్ధం అవుతోంది? ఒక్క వాజపేయి గారి కాలం లో తప్ప ప్రతీ ప్రధాని కాలంలో సుమారు 40% డాలర్ విలువ పెరిగింది అంటే రూపాయి విలువ తగ్గింది.
అసలు ఈ డాలర్ దాని అవసరం మనకు ఏమిటీ? దాని ధర పెరిగితే మనకు లాభమా? నష్టమా? మొదలగు వివరాలు క్లుప్తంగా చూద్దాం.
అమెరికా డాలర్ కథ:
నాణాలు, రూపాయలు రాకముందు ప్రజలు వస్తుమార్పిడి ద్వారా కావలసిన వస్తువులు సంపాదించేవారు. తరువాత బంగారం, వెండి, విలువైన రత్నాలు మొదలగు వాటి మార్పిడి ద్వారా వివిధ రాజ్యాలు మధ్య లావాదేవీలు చేసుకునే వారు. ఆధునిక కాలం లో పేపర్ కరెన్సీ వచ్చినా వాటికి కూడా వాటి వెనుక ఆధారంగా వుండే బంగారం విలువ బట్టి ఆ కరెన్సీ విలువ నిర్ణయింపబడేది.
కానీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత,ఐరోపా దేశాలు నాశనమై ఆర్ధికంగా బలహీన పడ్డాయి. అమెరికా మార్షల్ ప్లాన్ ద్వారా బిలియన్ల డాలర్ల సాయం ఇచ్చింది (ఐరోపా పునర్నిర్మాణం కోసం). అప్పట్లో అమెరికా 20,000టన్నుల బంగారం నిల్వలతో ప్రపంచ బంగారం నిల్వల్లో 70% కలిగి ఉంది. ప్రపంచ యుద్ధం తరువాత కూడా అమెరికా ఆర్థికంగా బలంగా ఉంది. డాలర్‌ను బంగారానికి మార్చుకునే హామీ ఇచ్చేది. (1 ఔన్సు బంగారం అంటే సుమారు 28.50గ్రా బంగారం కి = $35 డాలర్లు ఇచ్చేది). ఇదే "Gold Standard" వ్యవస్థ.
వివిధ దేశాల మధ్య వాణిజ్యానికి ఒక కామన్ కరెన్సీ ఉంటే బాగుంటుందని, 1944 సం. జులై నెలలో అమెరికా లోని న్యూ హంఫ్ షైర్ లో 'బ్రేట్టన్ వుడ్స్' అనే ప్రాంతంలో అమెరికా నేతృత్వంలో 44 దేశాలు(మన దేశం కూడా ఉంది) సమావేశమై, డాలర్‌ను అంతర్జాతీయ మారక కరెన్సీగా నిర్ణయించాయి. దీనినే 'బ్రేట్టన్ వుడ్స్' ఒప్పందం అంటారు. అప్పటి నుండి డాలర్ అంతర్జాతీయ కరెన్సీ గా వాడుకలోకి వచ్చింది.
ఆ సమయానికి పైన చెప్పుకున్నట్లు ఎవరైనా 35 డాలర్లు ఇస్తే వారికి అమెరికా ఒక ఔన్స్ బంగారం ఇచ్చేది. ప్రతీ డాలర్ ప్రింట్ కొట్టాలి అంటే దాని వెనుక 40% బంగారం మద్దతు ఉండాలి. అంటే అమెరికా ఎక్కువగా డాలర్లు ప్రింట్ కొట్టుకోవాలి అంటే ఆ మొత్తంలో 40% బంగారం నిల్వలు పెంచాలి అన్న మాట. ఈ సమయానికి అమెరికా వద్ద సుమారు 20,000టన్నుల బంగారం ఉండేది.
ఇది 1971వరకు ఇలాగే కొనసాగింది. కానీ అమెరికా- వియత్నాం యుద్ధం వల్ల, అమెరికా ఖర్చులు పెరిగి, డాలర్ల కోసం బంగారం అమ్మడంతో అమెరికా వద్ద బంగారం నిల్వలు 8100టన్నులకు తగ్గాయి. అంటే, కొత్తగా డాలర్లు ప్రింట్ చేసే అవకాశం లేదు. అందుకని అప్పటి అధ్యక్షుడు నిక్సన్ ఈ "Gold Convertibility" రద్దు చేశాడు. అంటే డాలర్లు ప్రింట్ కొట్టడానికి బంగారం మద్దతు లేకుండా కేవలం అమెరికా ప్రభుత్వ విశ్వాసంపై ఆధారపడి డాలర్ ప్రింట్ కొట్టబడేది. కానీ, అప్పటికే డాలర్ అంతర్జాతీయ కరెన్సీ గా చలామణి లోకి వచ్చేసి 50% అంతర్జాతీయ వాణిజ్యం డాలర్ల లోనే జరిగేది
కాబట్టి మిగతా దేశాలు ఏమీ చెయ్యలేక పోయాయి.
దీంతో డాలర్ అడ్డుపెట్టుకుని అమెరికా ప్రపంచ వాణిజ్యాన్ని శాసించడం మొదలు పెట్టింది.
ఎలా? ఏమిటీ?
అనేది ... రెండో భాగంలో చూద్దాం...
.....చాడా శాస్త్రి....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి