23, మార్చి 2012, శుక్రవారం


ఆచారాలు 


 ఈ సృష్టిలో ఏ జీవికి లేనిది వక్క  మనిషికే వున్నది తెలివితేటలు.  ఆ తెలివితో ఈ ప్రపంచంలోని వివిధ విషయాలను తెలుసుకున్నాడు మానవుడు.  మన మహర్షులు నిజానికి మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళు వారి దివ్య మేధస్సుతో మనకు ఎన్నో శాస్త్రాలను తెలియ చేసారు అంతేకాక మనము ఈ ప్రప్నచంలో ఏవిధంగా జీవించాలో కూడా చెప్పారు.  కాని మనము మన మిడి మిడి జ్ఞానంతో మన శాస్త్రాల పట్ల పూర్తిగా అవగాహన లేక మన మహర్షి విరచిత శాస్త్రాలని విమర్సిస్తున్నాము.  నిజానికి మనము మన శాస్త్ర సంపదని విమర్శించటానికి ఎంతవరకు సమర్దులము అని ఆలోచించాలి. ఇంటి దొడ్డి వాకిటి ముందు తులసి చెట్టు పెట్టుకోండి అని చెప్పారు కేవలము తులసి వక చెట్టు అంటే అందరు పాటించరని తులసి దేవత అన్నారు మహర్షులు తులసి దేవత అనటానికి కారణము  ప్రతి మనిషి భక్తితో వాళ్ళ  ఇంటిలో తులసిని వుంచుకుంటారని అయ్ వుంటుంది.  దానికి మనము రెండు రకాలగా తీసు కుంటున్నాము వకటి దేముడి మీద నమ్మకము వున్నవాళ్ళు తులసి ఇంట్లో పెట్టుకొని దానికి పూజలు చేస్తూ పసుపు కుంకుమ కొమ్మల మీద విపరీతంగా చల్లుతూ చెట్టుని పెరగకుండా చేస్తున్నారు.  ఇక రెండో రకం మనుషులు తులసి వక చెట్టు అది దేముడు ఎలా అవుతుంది చెప్పండి అని వాదన చేస్తూ ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోవటం లేదు నిజానికి ఈ రెండు రకాల భావనలు సరి ఆయనవి కావు.  మహర్షుల ఉద్దేశం ప్రతి  మనిషి విధిగా తన ఇంట్లో తులసి చెట్టు పెట్టుకొని దానిని మంచిగా కాపాడుతూ తులసి వల్ల లాభాలు పొందాలని  అయ్వుంటుంది.  తులసి చెట్టుకు మంచి అవుషధ  గుణములు ఉన్నయీ తులసి చెట్టు మీద నుండి వచ్చే గాలి మనకు ఆరోగ్యాన్నిస్తుంది దగ్గు, జలుబు మొదలగు రోగాలనుంది నివారిస్తుంది.  మనము తులసి చెట్టు ఇంట్లో వుంచుకొని రోజు వక దళాన్ని తినటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.  తీర్థంలో తులసిని ఉపయోగించడం కూడా మన ఆరోగ్యానికి మంచిదనే.  దీనిని  గుడ్డిగా ఆచరించకుండా ఆ ఆచారం వెనక వున్న అంతరార్ధాన్ని గమనిచి ఆచరిస్తే తప్పక మనకు మెయిలు జరుగుతుంది.

కామెంట్‌లు లేవు: