6, జులై 2020, సోమవారం

పూజాప్రక్రియ విదులు

పూజాప్రక్రియలో పాటించాల్సిన
విదులు మరియూ నిషిద్ధకర్మలు

ముందుగా స్నానవిధి

మగవారు ప్రతీరోజు తలస్నానం చేయాలి
నదీ స్నానం ఉత్తమం, తటాక(చెరువు) స్నానం మధ్యమం, కూప(బావి)స్నానం అధమం, పాత్రస్నానం అధమాధమం. అయితే నేటి తరంలో నగర జీవనంలో బహుళ అంతస్థుల నివాసాలలో ఇవి సాధ్యం కావు కాబట్టి బోరుబావి నీరు ఏరోజుకారోజు పట్టుకొని చేయటం మంచిది, అలాకూడా వీలుకాకుంటే చేసేది ఏమీలేదు.

ఈ శ్లోకాలు పఠిస్తూ చేస్తే ఉత్తమం 
1.గoగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ,నర్మదా సింధూ కావేరీ జలేస్మిన్ సన్నిదీమ్ కురూ, అనుకుంటూ....
అపవిత్రాహ:పవిత్రోవా సర్వాస్తాoగాతోపీవ యస్మరేత్ పుండరీకాక్షం సభాహభ్యంతరం శుచీహీ...
 అనీ చెప్పుకుంటే రోజూ పుణ్యనదీ స్నానాలు చేసిన ఫలితమే వస్తుందీ అనీ శాస్త్రవచనం

2.ఏకవస్త్రంతో స్నానం దోష కారకం, పాపం కూడాను, ఉపవస్త్రం (తువ్వాలు / పంచ) చుట్టుకొని స్నానం చేసి ఆవస్త్రం పిండి ఒళ్లు తుడుచుకొని మళ్ళీ నీళ్లలో జాడించి పిండి చుట్టుకొని వచ్చి మడివస్త్రం కట్టుకోవాలి ఈ పంచని నడుముకు చుట్టుకోవాలి పూజలో మగవారు ఏకవస్త్రంతో పూజ చేయరాదు, ఎడమ భుజం మీదుగా ఉత్తరీయం ఉండి తీరాలి, చినిగిన వస్త్రం అశుభ్రంగా ఉన్న వస్త్రాలు కట్టుకోరాదు

3).గృహంలో దేవతా విగ్రహాలు ఆరు అంగులముల కన్నా తక్కువ పరిమాణంలోపే ఉండాలి.
అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కూర్చుని చదవరాదు. అలాగే దేవుడికీ పవళింపు సేవ చేయనప్పుడు నిలబడి చేయరాదు. 
4).నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం కుంకుమ అయినా లేకుండా పూజ చేయకూడదు.
5.ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం,  చేతులు పోవటం కానీ జరుగుతాయి.

6).దేవునికి (ఈశ్వరునికి)ఏ సందర్భంలోనైనా సరే వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు, కాస్త ప్రక్కన నిలబడి చేయాలి

 7).ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపాలతో వేరే పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. 

8).పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి. అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. 

9).ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.

10).ఈశ్వర నిర్మాల్యం  తీసేసిన పూలను కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. 

11).రుద్రాక్షలు ,తులసీ మాలలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, లాంటి శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.

స్త్రీలకి నిషిద్ధకర్మలు :-

1. స్త్రీలు తులసీ దళాలు తుంచ రాదు.

2.ప్రతీ రోజు తలస్నానం చేయకూడదు, (సంసార జీవితంలో పాల్గొన్నా, మాంసాహారం భుజించినా సరే)
మంగళవారం, శుక్రవారం, తలస్నానం అస్సలు చేయకూడదు.
3.ముత్తైదువులూ శిరో ముండనం చేయించుకోకూడదు. భర్త తలనీలాలు ఇస్తే భార్యకు సగం పుణ్యం వస్తుంది ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు
4. సాధారణంగా శుక్రవారం వ‌స్తే ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి.
రోజు త‌ల‌స్నానం చేసే వారికి మాత్రం ఇది వ‌ర్తించ‌దు. వారానికి ఒక్క‌సారి లేదా రెండు సార్లు త‌ల‌స్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిదికాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. 
ముఖ్యంగా మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు. ఒక వేళ శుక్ర‌వారం త‌ల‌స్నానం చేస్తే సౌఖ్యాల‌న్నీ దూర‌మ‌వుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అదే శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే ఐశ్వ‌ర్యం ల‌భిస్తుంది అంటున్నారు.

కామెంట్‌లు లేవు: