6, జులై 2020, సోమవారం

పాపం-పుణ్యం-దేముడు

ప్రతి జీవి ఎవరి కర్మ వారే అనుభవించాలి.  కర్మ ఫలితాన్ని మంచిదైన, చెడుదైన దానిని మార్పు  చేసే శక్తి ఏ మానవుడికి లేదు. దీనిని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. 
మీరు ఒక బ్యాంకులో అకౌంటు కలిగి వున్నారు అనుకోండి ఆదే  బ్యాంకులో మీరు అప్పు తీసుకున్నారనుకోండి. అప్పుడు మీకు బ్యాంకులో రెండు అకౌంట్లు వున్నాయి  ఒకటి డిపాజిట్ అకౌంట్ రెండు లోన్ అకౌంట్. ఇప్పుడు మీరు లోనే అకౌంటులో తక్కువ డిపాజిట్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు వున్నాయనుకోండి అప్పుడు మీరు ఇచ్చిన చెక్కు బ్యాంకు వారు తీసుకొని మీకు డబ్బులు ఇస్తారు. అదే మీ లోనే అకౌంట్లో ఎక్కువ డిపాజిట్ అకౌంట్లో తక్కువ డబ్బులు ఉంటే మీ చెక్ బౌన్స్ చేసి ముంది మీ లోన్ తీర్చమని మీకు బ్యాంకు మేనేజర్ సూచిస్తాడు.  కట్టక పొతే మీ ఆస్తిని అమ్మి డబ్బు వసులు చేస్తాడు. 
ఇప్పుడు మన కర్మ గూర్చి మాట్లాడుదాము. మీ డిపాసిట్ అకౌంట్లో వున్న డబ్బులు మీరు చేసుకున్న పుణ్యం అనుకోండి. మీ లోన్ అకౌంట్లో డబ్బులు మీరు చేసుకున్న పాపం అనుకోండి. బ్యాంకు మేనేజర్ భగవంతుడు అనుకోండి. ఇప్పుడు మీకు మీ కర్మ ఫలితం ఎలా అనుభవిస్తారో తెలుస్తుంది. పుణ్యం చేసిన వారు దేముడిని కోరుకునే కోరిక వెంటనే నెరవేరుతుంది. అంటే వారి చెక్కు హానర్ అవుతుంది అని అర్ధం. మరి మీ అకౌంట్లో పాపం ఎక్కువుంటే మీ ప్రార్ధన నెరవేరదు ఎందుకంటె మీ పాపం ఎక్కువ వున్నది. ముందు అది కట్టాలి అని మేనేజర్ (దేముడు) నిన్ను పాప ఫలాన్ని అనుభవించేటట్లు చేస్తాడు.  అయితే పాపఫలితాని అనుభవించకుండా తప్పించుకునే మార్గం వుంది అదే ఇప్పుడు మనం పుణ్య కార్యాలు చేయటం. పుణ్య కార్యాలు ఎక్కువ చేస్తే మీ డిపాజిట్ అకౌంట్లో జమ పెరుగుతుంది. అప్పుడు మీ చెక్ ఆనర్ అవుతుంది అదే మీరు దేముడిని కోరుకున్న కోరిక నెరవేరుతుంది.   దేముడు కేవలం బ్యాంకు మేనేజరులాంటి వాడు అయన ఎవరిని ప్రేమించడు, ద్వేషించాడు. అందుకే దేముడు త్రిగుణాతీతుడు. అందరు వారు వారు చేసుకున్న కర్మను మాత్రమే అనుభవించాలి. 

కామెంట్‌లు లేవు: