31, డిసెంబర్ 2020, గురువారం

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*66. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితా*


సంపత్కరీ అను దేవత ఒక యేనుగును అధిరోహించి తనచుట్టూ అటువంటి యెనుగుల గుంపులతో సేవించబడుతూంది. ఆమె వైభవం వూహించటకు శక్యంకాదు లలితా త్రిపుర సుందరీదేవి తన గజబలములకు యీ సంపత్కరీ దేవిని అధికారిణిగా నియమించింది. లలితా దేవియొక్క అంకుశమునుండి ఈ సంపత్కరీదేవి పుట్టినది.


ఈ సంపత్కరీదేవి “రణ కోలాహలము" అనే పేరున్న మత్తగజముపై అధిరోహించి వుంది. ఆ దేవి ననుసరించి కోట్లకొలదీ యేనుగులు వచ్చాయి


భద్రగజములు, మందగజములు, మృగగజములు అనుభేదములుగల యేనుగులను సంపత్కరీ దేవి మచ్చిక చేసికొని అధిరోహిస్తుంది. అలాంటి గజసమూహము చేత శ్రీ లలితాదేవి సేవించబడుతున్నది


సంపత్కరీ' అనునది ఒక విద్యకు పేరు. సుఖ సంపత్కరి ఐక్య సంపత్కరి అనే విశేషములు గలది. ఇట్టి ఐక్యసంపత్కరీ విద్యలచేత దేవి సేవించబడుతుంది


శ్రీ చక్రములో త్రికోణముకుపైన వుండి పూజింపబడే 'కామేశ్వరీదేవే' 'సంపత్కరీ*

అనే దేవత


కం|| గజ సైన్యపు, సంపత్కరి

నిజాయుధపు, యంకుశమున, నిండై కొలువన్ గజ సింధుర బంధురములు,

యజరామర, మూర్తిగొలువ, నధికోత్సహితుల్!!

   

        లలితానామసుగంధం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృతా


అశ్వారూఢ" అనే దేవతచే అధింపబడ్డ కోటానుకోట్ల గుఱ్ఱములచే పరవేష్టిం

బడి వుం


లలితాదేవి పాశమునుండి' మిక్కిలి చురుకైన విక్రమముతో “అశ్వారూఢ" అనే దేవత పుట్టింది.ఆమె "అపరాజిత” అనే గుఱ్ఱము పైనెక్కి బయలుదేరగా ఆమెను అనుసరించి కోటానుకోట్ల సంఖ్యలు గల గుఱ్ఱములు వాయువేగంగా ఆమెను అనుసరించి వచ్చి అవన్నీ “శ్రీదేవిని” సేవిస్తున్నాయి


ఇంద్రియములను గుఱ్ఱములుగా చెబుతారు. ఇంద్రియములపై అధిష్టించి ఆ యింద్రిములను స్వాధీనపరుస్తుంది గనుక, ఆ దేవి"అశ్వారూఢ" ఇంద్రియములను; వాటి వాటి పనులలో నడిపించు మనసునకు ఆత్మజ్ఞానం కావాలి. అజ్ఞానం చేత ఇంద్రియాధీనం అయిన మనసు కట్టుబడ


లలితాదేవిని ఉపాసించేవారు ఇంద్రియములను జయించి ఆత్మ జ్ఞానము తెలుసుకున్నవారై పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. భండాసుర వధలకై బయులుదేరిన అలితాదేవికి ఒకవేపు గజదళాధిపతియైన "సంపత్కరి" అశ్వదళాధిపతియైన"అశ్వారూఢ" మరొకవేపునా ఉన్నారు


కం|| అశ్వారూఢా, దేవి

అశ్వంబులు కోటి కోట్లకధిపతి దానై

విశ్వంబును గెలువ గలు

విశ్వంభరి చెంతను పరివేష్టిత మగుగా


        లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*68.చక్రరాజ రధారూఢ, సర్వాయుధ పరిష్కృతా


చక్రరాజ' అనే పేరుగల రధముపై సమస్తమైన ఆయుధములతో అలంకరిం

బడి శ్రీమాత వున్న


చక్రరాజ "కిరిచక్ర" "గేయచక్ర" అనే రధములు రధశాస్త్రమలో వర్ణించబడ్డాయి. శ్రీదేవి “చక్రరాజము" అనే రథమునందు వున్న


దానికి “ఆనందధ్వజము" దానికి తొమ్మిది పర్వములు


గేయచక్రరథమునకు" ఏడుపర్వములు, దానియందు "మంత్రినాధ” అనే దేవత వుంది! "కిరిచక్రమునకు "ఐదుపర్వములు. దానిపై "దండనాధ" అనబడే దేవివుం


'చక్రరాజ రధ' మెక్కడవుంటుందో అక్కడే గేయచక్రరథము గేయచక్రరథ మెక్కడ వుంటుందో అక్కడే కిరిచక్రరథమూ వుంటా


సర్వాయుధములతో అలంకరించబడిన "చక్రరాజము" అనే రధంలో దేవిభండాసురుని సంహరించుటకై నెలకొని వున్నది


"శ్రీ" చక్రమే “చక్రరాజమగుటచేత చక్రపుగుర్తులు, యంత్రపు గుర్తులు, మంత్రముల గుర్తులు, యోగ సంకేతములూ దానిలో వుంటా


ఆ “చక్రరాజ" రధములో 'పర్వములు' అని చెప్పబడినవి. శ్రీచక్రమందు

ఆవరణలుగా వుంటవి


కం|| శాత్రవ మర్ధవిరాజి

ఆత్రిపురాంబిక, రధమది యార్తుల గాయన్త

చిత్రంబగు యుద్ధము

జైత్రం బగు చక్రరధము సరగున విడిసెన్!


        లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*69. గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితా


లలితాదేవి గేయచక్రము అనే పేరు గల రధముపై ఎక్కిన మంత్రిణి యగు "శ్యామలా దేవి చేత సేవించబడుతూవుం


ప్రసిద్ధమైన చక్రముగల రధము అనగా "సూర్యమండలము


సూర్యలోకములో నివసించే శ్రీవిద్యను వుపాసించు యోగినులు వారు ఎల్లప్పుడూ ఆ మాతను ధ్యానిస్తూ వుంటారు


శ్రీచక్రమున మధ్యబిందువు చుట్టూవుండే త్రికోణమే "గేయచక్రము" అదిత్రిపురాశక్తి బుద్ధి తత్వముల పరిణామమే మంత్రిణి దేవికీ యీశక్తికీ భేదము లేదు. ఈ దేవిని ఉపాసించుట వలన పరబ్రహ్మసాక్షాత్కారము అవుతుంది. మంత్రిణి


శ్యామలా దేవి గేయచక్రరధముపై కూర్చొని శ్రీమాతకుకుడి భాగమున వుంటుంది


గానము చేయడానికి యోగ్యత గలది. ఈ మంత్రిణీ దేవికి గేయా శ్యామలాంబా సంగీత యోగినీ అనే ఇతర పేర్లు వున్నవి. ఆమె చక్రము సప్తస్వరములతో వుంటుంది. దానికి 'గిరిచక్రము' గీతి చక్రము అని కూడా పే


శ్రీశ్యామలాదేవి సంగీత మాతృకయగుట వలన ఆమె కూర్చున్న రథము 'గేయచక్రము. ఆమె వీణ గలిగినది. ఆమె ఆసనము "గేయము


కం|| మంత్రిణియగు నాశ్యామల, తంత్రములను వల్లెవేయు తగునారధము

యంత్రంబుల, సంజనితపు

మంత్రాన్వితయై, మరికుడి, పార్శ్వము నడచెన్


       లలితానామసుగం🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


 *70.కిరిచక్రరాజరధారూఢ దండనాధ పురస్కృతా


వారాహముల చేత లాగబడుతూన్న రథమునందు ఎక్కిన 'దండనాధ' యైన వారాహీ దేవిచేత పరమేశ్వరి సేవించబడుతున్న


కిరిచక్రరథము' అనగా వారాహములవలే వుండిన చక్రముల గల రధమని గూడా అర్ధము. ఎల్లప్పుడూ చేతియందు దండమును ధరించినది కనుక 'దండనాధ' అని పేరు సృష్టి స్థితి, లయ' ఈ మూడింటినీ కూడా “కిరిచక్రము" అనబడును. ఆ రథముపై ఎక్కినప్పుడు యీమె దండధరుడైన యమునకు కూడా లొం


శ్రీ చక్రములో “వసుకోణచక్రము"నకు “కిరిచక్రము" అనిగుర్తు. ఆత్రికోణ చక్రములోని "మహాత్రికోణ, నైరృతి" కోణములో పూజింపబడే 'భగమాలినీ' ‘వారాహీదేవి అంటారు. మనిషిలో వుండే ఇంద్రియములు అనే సైన్యమును అదుపులో వుంచి నడిపిస్తూ వుంటుంది యీ దే


శ్రీమాతకు యిటువంటి దండనాధులు పన్నెండుమంది వుంటారు. అందరిలో "వారాహీ దేవి” ముఖ్యురాలు. శ్రీచక్రమున మహాత్రికోణములో వుండి నైరుృతి కోణములో పుండి పూజింపబడే "భగమాలినీ” అను దేవియే వారాహీదేవి


మన ఆత్మలో వున్న మనసే దండనాయిక. ఈ దండనాయిక ఇంద్రియములనే సైన్యమును అదుపులో వుంచి నడిపిస్తుం


కం|| వారాహీపరమేశ్వరి

భారము వహియింప నెడమ పార్శ్వము సందు

వీరతలన్ వెలసినదై

పూరిత శక్తికిరిచక్ర, పూని వెలసెనూ


         లలితానామసుగంధం

                   M s.s.k !,న్,ది..విగదుది*



                

కామెంట్‌లు లేవు: