24, డిసెంబర్ 2020, గురువారం

ప్రారబ్దం

 ప్రారబ్దం శరీరానికి సంబంధించినదని కొందరు అనుకుంటారు. కానీ, ప్రారబ్దం శరీరానికి సంబంధించినది కాదు. అది ఆత్మసంబంధమైనది. జీవి జన్మించి, తన బుద్ధితో పుణ్య పాప కర్మలను ఆచరించటం జరుగుతుంది. ఆత్మ స్వయంగా కర్మాచరణము చేయలేదు. ఎందుకంటే ఆత్మ, బుద్ధి ,మనస్సు ఇవన్నీ భౌతికమైనది కావు.  అందుకే ఇవి కర్మాచరణకు శరీరం అనే సాధనాన్ని ఉపయోగించుకొని కర్మలను చేయిస్తాయి. సంకల్పం వీటిదే అయినా, చేసేది శరీరమే. కానీ ఈ కర్మఫలాలు శరీరానికి అంటవు. కర్మాచరణ తరువాత (జన్మాంతంలో) ఆ శరీరం నశిస్తుంది. కర్మఫలం మాత్రం జీవుడిని (ఆత్మను) అంటుకొని ఉంటుంది. ప్రారబ్దం శరీరానికి సంబంధించినదైతే అది శరీరం నశించగానే ప్రారబ్దం నశించాలి. కానీ జీవిని అంటిపెట్టుకొని ఉండి మరలా జన్మించి శరీరధారి అయినప్పుడు ఆ పూర్వకర్మల ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవి అనుభవించుటవలననే కర్మఫలం నశిస్తుంది. ఆ విధంగా ఒకజన్మ నుండి మరొకజన్మకు సంక్రమిస్తుంది కనుకనే అది ప్రారబ్దం అని పిలువబడుతోంది. ఈ విషయాన్ని ఎఱిగి మానవుడు కర్తృత్వభావనగానీ, కర్మఫలాపేక్షగానీ లేకుండా తాను ఆచరించవలసిన కర్మలను ఆచరించాలి. గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినది ఇదే.

కామెంట్‌లు లేవు: