11, జూన్ 2021, శుక్రవారం

ఓర్పులేన సాధకుడ

 *సుఖినోభవంతు:🙏


🌸*శుభోదయం*🌸


ఓర్పు*


*కొద్దిగంటలు వేచిఉంటే, జీవితకాలం నిరీక్షించినట్లు అనిపిస్తుంది చాలామందికి...*


*ఒక కొత్త శిశువును చూడాలంటే తొమ్మిది నెలలు ఆగాలి...*


*కొన్ని రకాల కాయల కోసం ఆ చెట్లను పెంచి, వృద్ధిచేసి, కాపుదశ రప్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది...*


*అవధుల్లేని ఓర్పుతో ఎన్నో పనులూ సాధ్యమవుతాయి...*


*ఓర్పులేని మనిషి మనిషే కాడు.. అజ్ఞానం వల్ల సహనం కోల్పోయి, తన స్థితిని మరింతగా దిగజార్చుకుంటాడు మనిషి.. అందరూ పారిపోయేచోట ధీరుడు నిలబడతాడు.. అతడి జెండా ఓర్పు.. సహనంతో ఉండగలిగితే అన్ని పనులూ ఒకటొకటిగా సానుకూలమవుతాయి...*


*రాత్రి చీకటిలో గడిపితేనే సూర్యోదయం చూడగలం.. మనసులో ఆలోచనలు లేస్తాయి..  ఉన్నచోటున ఉండనివ్వవు...*


*రాయిలాంటి స్థిరమైన మనిషినీ కదపాలని చూస్తాయి.. కదలకూడదు...*


*సహనమే మనిషిని రుషిని చేస్తుంది.. సహనం కలిగినవాణ్ని చూసి ఎంతటివారైనా భయపడతారు.. సహనం మనిషిని చరిత్రలో నిలబెడుతుంది..  సహనమే సత్యాన్ని చూపిస్తుంది...*


*సహనంలేని వ్యక్తి నాయకత్వం వహించలేడు.. సహనంలేని వ్యక్తి నాయకుణ్ని అనుసరించలేడు.. సహనంలేని వ్యక్తి కలిసి జీవించలేడు.. సహనంలేని వ్యక్తి ప్రకృతికి అనుకూలంగా బతకలేడు..*


*ఎదురుచూసి ఎదురుచూసి సంవత్సరాలు గడిచిపోయాయి.. ఓర్పు మహావృక్షమైంది.. కారడవిలో సహనమే ధైర్యంగా శబరి ఎదురుచూసింది.. ఆమె నిరీక్షణ ఫలించింది.. శ్రీరాముడొచ్చాడు.. జన్మజన్మల ఓర్పు విజయశిఖరం చేరుకుంది...*


*ఎదురు చూసేవాళ్లను నిరాశపరచడు భగవంతుడు.. పడవ నడిపే గుహుణ్ని.. రాయిగా పడి ఉన్న అహల్యను అనుగ్రహించాడు..*


*తపస్సుకే తమ జీవితాలను అంకితం చేసిన మహారుషుల కోసమే శ్రీరాముడు భూమ్మీద అవతరించాడు...*


*మేఘజలం తప్ప మరే నీటినీ తాగని చాతకపక్షి కారుమబ్బు కోసం ఎదురుచూస్తుంది..*


*కోకిల రాకకోసం వసంతం వేచిఉంటుంది..*


*ఓర్పు మనకు హృదయానందాన్ని కలిగిస్తుంది...*


*ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తల జీవితాలు గడిచిపోతాయి.. వారి సహనం, అంకితభావమే మానవాళికి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది...*


*చుట్టూ పుట్టలు ఏర్పడి.. తపస్సులో సుదీర్ఘకాలం నిమగ్నమైన సాధారణ నరుడు వాల్మీకిగా అవతరించాడు...*


*మహాకావ్యాన్ని లోకానికి అందించాడు...*


*అన్ని సుగుణాలూ ఉండి.. సహనం ఒక్కటే లేకుంటే- లాభం లేదు...*


*ప్రతిభా పాటవాలు తక్కువైనా ఓర్పుతో నేర్పుతో ప్రవర్తించే వ్యక్తికి తిరుగుండదు...*


*సరైన సాంగత్యంలో నిజమైన ఓర్పు బయటపడుతుంది...*


*నిండు సభలో శ్రీకృష్ణుణ్ని నానా దుర్భాషలాడాడు శిశుపాలుడు...*


*విన్నవాళ్ల రక్తం మరిగిపోయినా.. శ్రీకృష్ణుడు తరగని చిరునవ్వుతో ఓర్చుకున్నాడు... అంతిమంగా ఏం జరిగిందో తెలిసిందే...*


*ఎదుగుతున్నకొద్దీ ఒదిగే గుణం ఓర్పుగా ఉంటే వస్తుంది...*


*ఒక చిన్న మొక్క వందల ఏళ్లు ఎదిగి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వృక్షంగా మారుతుంది...*


*ఓర్పు చరిత్రను తిరగరాస్తుంది...*


*ధర్మరాజు లాంటి మనిషి అంటారు.. దుర్యోధనుడి లాంటి మనిషి అనరు.*


*ఓపిక వహించు... అన్నీ సర్దుకుంటాయి అని మన పెద్దలు ఎన్నోసార్లు చెబుతుంటారు...*


*ఓపిగ్గా మనం నిరీక్షించలేకపోవడానికి కారణం- ప్రకృతి పనిచేసే విధానం...*


*అది మనమీద చూపించే ప్రభావం.. చంచల స్వభావం కలిగిన మనసు మన బతుకును నడిపించడం.. మనకు తెలియకుండానే దానికి వశమైపోయి మనం ఓడిపోతుంటాం...*


*గెలవాలంటే ఓర్పు కావాలి.. సహనంలేని ఏ వీరుడూ చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు...*


*ఓర్పులేని ఏ సాధకుడూ సత్యానుభూతి పొందిన సన్నివేశాలు లేవు..

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు

కామెంట్‌లు లేవు: