7, ఆగస్టు 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *06.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2222(౨౨౨౨)*


*10.1-1323-వ.*

*10.1-1324-*


*మ. కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్*

*నెరయన్ గోపకు లంతనంత మెలయన్ నిత్యాహవస్థేము లా*

*హరిరాముల్ చనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితా*

*మర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్.*



*_భావము: ఆపై రక్తసిక్తమైన ఆ దంతాలతోనే మావటిలను కూడా యమపురికి పంపి, చెమటబిందువులు ముఖమండలముమీద మెరుస్తుండగా, ఆ దంతాలను భుజాన వేసుకుని, యుద్ధములో స్థిర పరాక్రమము గల బలరామకృష్ణులు వస్తున్నారు. గోపాలకులచే పరివేష్టింపబడి వేంచేస్తున్న ఆ అపూర్వ సోదరులు యుద్ధభేరీ ధ్వనులతో దేవతలకు, మానవులకు కూడా ఆందోళన కలిగించే మల్లరంగస్థలిని చూశారు._* 🙏



*_Meaning: Balarama and Sri Krishna finished off those defiant mahouts using the bloody tusks and along with the beaming cowherds, the victorious pair entered the wrestling arena with the tusks on their shoulders and sweat shining on those beautiful faces. The wrestling ring and the surroundings are reverberating with horrid continuous din of noise emanating from trumpets and other instruments and creating dread and fear in the men and other celestial beings._* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: