7, ఆగస్టు 2021, శనివారం

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది....

 *ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.....*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రోజూ ఉదయమే చాలా మంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంత మంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా.. లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...*


*మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???*


*నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.*


*ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒక వేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...*


*తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |*

*ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||*


*తాత్పర్యం...*


*తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను. పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగు వానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.*


*మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి. లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతుని శాశ్వతమైన వైకుంఠం చేరుకొంటాం. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు.*


*మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజలు వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా.. ఒక్కాసారి ఆలోచించండి. తెలియని వారికి తెలియచేసి వారికి సాయం చేయండి...*


*హరే కృష్ణ*💐💐___________________________________

👉 *ఈ గ్రూపులో(మన సనాతన ధర్మ పరిరక్షణ)* 

1.భగవద్గీత, 2.భాగవతం,3.మహాభారతం, 4.ధర్మానికి సంబందించిన సమాచారం, 

5.గురు వాక్యాములు,7.గురు సందేశము (పరంపరలో ఉన్న ఆచార్యుల నుండి) 6.ఉదయం భగవంతుని శృంగార దర్శనము, 

7.రాత్రి శయన దర్శనములు, 

8.ధర్మ సూక్తులు మొదలగునవి....... ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు మా బృందం ఎప్పుడు పంపుతూ ఉంటుంది సహకరించండి.

___________________________________

👉ఇవన్నీ 

*మన సనాతన ధర్మ పరిరక్షణలో* గ్రూపులో పొందవచ్చును.

మీరు మన గ్రూపులో చేరండి పది మందికి పంచండి.మీరు ఆధ్యాత్మికముగా వృద్ధి అవ్వాలి.

------------------------------------------------------

🕉️ *మన సనాతనధర్మాన్ని గురించి తెలుసుకుందాం, ఆచారిద్దాం, ప్రపంచ శాంతిని కోరుకుందాం* 🕉️

☘️మీ సేవలో ఎప్పుడు

 *మహేశ్వర్ దాస్* మరియు *బృందము* 🙏 

_____________________________________

కామెంట్‌లు లేవు: