20, డిసెంబర్ 2022, మంగళవారం

telugu word Daily

 Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

12వ దినము (19-12-2022):

ఆకాశము:

తెలుగు: అంతరిక్షము,అంబరము, అక్షరము, అనంగము, అనంతము, అభ్రపథము, ఆకసము, ఉడుపథము, ఖంబు, ఖము, గగనము, చరాచరము, చుక్కలత్రోవ, తారాపథము, దివము, దివి, ధత్రము, ధృవము నభము, నాకము, నింగి, నిరాకారము పుణ్యము, పుష్కరము, బర్హిస్సు, భగము, భువనము, మిన్ను, మేఘద్వారము, రోదసి, వాయువర్తనము, విభువు,విష్ణుపదము, వ్యోమము, శబ్దగుణము, శుషిరము, శూన్యము, సంపూర్ణము, సత్పథము, సన్మార్గము, సర్వతోముఖము, సోమధార, స్పర్శము, హరిపదము. 


ఆంగ్లము: SPACE

కామెంట్‌లు లేవు: