28, జూన్ 2023, బుధవారం

ఈ రోజు పదము

 204వ రోజు: (సౌమ్య వారము) 28-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

సంతానవతి : కరవీరి, కుటుంబిని, కృమిల, కొదమరి, జీవసువు, బహుసుత, విజాత. 


 ఈ రోజు పద్యము:


ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు  ని/

ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా/

చీరలు నూరుటంకములు చేసెడివైనను పెట్టెనుండగా/

చేరి చినింగిపో గొరుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!


ఎంతో విలువైన బట్టలు పెట్టెలో ఉండగా చిమ్మట పురుగు వాటికి చిల్లులు పెట్టి కొరికి పాడుచేస్తుంది. దానివల్ల ఆ పురుగుకి ఏమి లాభం లేదు. వాటికి పాడు చెయ్యటం ఒక స్వభావము. అలాగే ఎవ్వరినీ ఏమీ పల్లెత్తు మాట అనక తన ఇంట తానున్న సజ్జనుణ్ణి నిష్కారణంగా దుర్జనుడు అపకారం చేసి బాధ పెడతాడు. వాడికి వచ్చే లాభం ఏమీ లేదు. అది చెడ్డవాని గుణం.

కామెంట్‌లు లేవు: