7, జులై 2023, శుక్రవారం

ఆంధ్ర కవిత్వంలో కవితా రీతులు

 ఆంధ్ర కవిత్వంలో విభిన్న కవితా రీతులు 

                                        _______________________________ 


                                                      ఎఱ్ఱా ప్రగ్గడ 


       ఉ: భాసుర  భారతార్ధముల  భంగుల  నిక్క మెఱుంగ  నేరమిన్ 

             గాసట   బీసటేఁ  జదివి  గాధలు  పన్నుఁ  దెలుంగు  వారికిన్ 

             వ్యాస ముని  ప్రణీత  పరమార్ధముఁ దెల్లముఁ  జేసినట్టి  య 

              బ్జాసన  కల్పులం  దలతు నాద్యుల  నన్నయఁ  దిక్కనార్యులన్; 


                                           నృసింహ పురాణము- అవతారిక ; 


                          భారతాంధ్రీ కర్తలలో  తృతీయుడు ఎఱ్ఱన. యితడు ప్రోలయ వేమారెడ్డి యాస్థానకవి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు , యితనికి గలబిరుదములు. నన్నయ విడువగా మిగిలిన యారణ్య పర్వ శేషమును పూరించుటయేగాక,  నృసింహ పురాణము , హరివంశము , రామాయణము లితని యన్య కృతులు. ఇందు రామాయణముఁ దక్క తక్కిన రెండు గ్రంధములు యితని సుస్థిర కీర్తికి భాజనమై నేటికిని సారస్వ తాభిమానుల మన్నన లందుచున్నవి. 


               " పరిఢ వింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు"  అని శ్రీనాధ కవి యితని యందు సూక్తి వైచిత్రి యను కవితాగుణ మున్నట్లు పేర్కొనినాడు . దానిని బట్టి యితని కవిత కలంకారమై సూక్తి వైచిత్రి భాసించు చున్నదని విజ్ఙుల యభిప్రాయము. సు+ ఉక్తి- సూక్తి; మంచిమాట లేదామంచివిషయం 

సూక్తి యౌతుంది. దానిని విత్రంగా , వింతగా చెప్పుటే సూక్తి వైచిత్రి. కొంచెం వక్రోక్తికీ దీనికీ దగ్గర సంబంధం. కాకపోతే, అందులో శ్లేష, లేదా కాకుస్వరం, ప్రధాన పాత్ర వహిస్తాయి. యిందులోఆవిన్యాసం వుండదు. మామూలు మాటల లోనే విచిత్రార్ధముల కూర్పు కనబడుతుంది.ఒకచిన్న యుదాహరణ - 


                      " ఉల్లంబు  మీచూడ్కి కుచ్చి  పోకకు గదా 

                                        వాలంమ్ములకు నోర్చు వారి యొడుపు; 


                            నృసింహ పురాణంలో దేవేంద్రుని మాటలు. హిరణ్య కశ్యపుని తపోభంగమునకు రంభాదులను ప్రోత్సహించుచు పలికిన పలుకులు. యుధ్ధమున వీర మరణము నొందినవారు స్వర్గస్తులై, అప్సరసల కౌగిలో సుఖింతురని పెద్దల సూచన. శాస్త్ర వాక్యము. దానినే కవి సూక్తి వైచిత్రి తోఁప్పుచున్నాడు. 

సివర్గమున మీచూపు తూపులతో తమహృదయమును ఛిద్ర మొనర్చు కొనుటకేగదా వీరుల యుధ్ధరంగమందు వాడిబాణముల నెదుర్కొని వీర మరణము నొందుచున్నారు.అని. యదార్ధమునకు వీరులు తప్పక యుధ్ధమున పాల్గొను చున్నారు. శతృవీరులచేతిలో విధిలేక మరణము నొందు చున్నారు. దానినీతడు స్వఛ్ఛందముగా రంభాదులసౌఖ్యములకై మరణించు చున్నారని చెప్పుట చిత్రమేగదా! మొత్తమన్ని గ్రంధములయందు నిట్టి విచిత్రము గానవచ్చును. 


                  2 అనువాద నైపుణ్యము నితని రెండవ కవితా గుణముగాఁ జెప్పనగును. నన్నయది తత్సమ పదబహుళమైన ప్రసన్న శైలి. తిక్కనదో, అచ్చ తెనుఁగు పదముల ముచ్చటలతో నడచెడు పద్య రచన. యీరెండిటి నడుమ కవితా వారధి నిర్మాణము బహుకష్ట సాధ్యము. అయినను నేర్పరియైన యగసాలి తానొనరించిన బంగరు నగ నతుకు గనబడకుండ తయారు చేసిన వడువున నన్నయ తిక్కనల కవితల నడుమ భేదమును కొలది కొలదిగా తగ్గించుచు , నన్నయ శైలితో నారంభించి పోనుపోను తత్సమపదములను తగ్గించుచు తెలుగు పదములను బెంచుచు తుదకు తిక్కన ెశైలితో నరణ్య పర్వ శేషమును ముగించెను. గమనింపుడు. 

              

         ఉ: శారద  రాత్రు లుజ్జ్వల  లసత్తర  తారక హార పంక్తులన్ 

              చారు తరంబులయ్యె; వికసన్నవ కైరవ గంధబంధురో 

               దార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ క 

               ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబర పూరితంబులై; 


                               నన్నయ  చివరి పద్యము - 


              చ:  స్ఫుర దరుణాంశు  రాగరుచిఁ  బొంపిరి వోయి నిరస్త  నీరదా 

                     వరణములై దళత్కమల వైభవ ఝృంభణ ముల్లసిల్ల , ను 

                     ధ్ధుర తర హంస సారస మధువ్రత నిస్వన ముల్  సెలంగా 

                            గరము వెలింగె వాసర ముఖంబలు శారద వేళఁజూడగన్; 

                   

                       ఈరీతిగా నతనిృయనవాద కళ సాగిపోయినది. 


              3 తత్సమ పద ప్రయోగ చాతుర్యము 

                   _________________________ 


                  తత్సమ పదముల పోహళింపు సొంపు లను యితని మూడవ కవితా గుణముగా నెన్న వచ్చును.పైపద్య మావిషమును నిరూపించినదిగదా! 


               ఉ:  పొందదు  దుఃఖముల్  భయముపొందరు పొందరు దైన్యమెమ్మయిన్ 

                      పొందవు తీవ్ర దుర్దశలు పొందు బ్రియంబులు పొందు సంపదల్ 

                       పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తు లెందు  గో 

                        వింద పదారవింద  పదవీ పరణధ్ధ గరిష్ఠ   చిత్తులన్;

                      

                                     నృసింహ పురాణము 


                అటు లని తెనుగు పదములపై మమకారము లేనివాడని చెప్పుటకు వీలులేదు. సందర్భోచితముగా తెలుగు వెలుగులను జిలుగులు నింపు 

చుండును. 


           


                           రామాయణ మందలి యీపద్యమున హనుమంతుఁడు సముద్ర తరణము నొనరించుట నెంత కమనీయముగా వర్ణించెనోఁ జూచితిరిగదా! మరియొక పద్యమును హరివంశము నుండి ప్రదర్శించి విరమింతును. 


            శా: నోరం జేతులు రెండుఁ గ్రుక్కు కొనుచున్ , మోమెల్ల భాష్పాంజన 

                  స్మేరంబైఁ  దిలకంప నేడ్చుచుఁ  బొరింమీజేతులం గన్నులిం 

                   పారం దోముచుఁ జేవఁబూని పిరు దొయ్యం మీదకల్లార్చుచున్ 

                    శ్రీరమ్యాంఘ్రి యుగంబు గింజుకొనుచుం జెల్వంబు రెట్టింపగా; 


                         బాలకృష్ణుని వర్ణనము హరివంశము 


                    ఇట్టుల కవిత్యమున కవిత్వమున దీటుగా మేటిగా సాగిన కవితల్లజుడు  ఎర్రన సత్కవి ! 

      

                                         స్వస్తి భవతాం!🙏💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐

కామెంట్‌లు లేవు: