30, జులై 2023, ఆదివారం

భార్యలు - భిన్న స్వభావాలు

 *ॐ భార్యలు - భిన్న స్వభావాలు* 


*కౌసల్యామాత సీతాదేవితో* 


*అసత్యశీలా వికృతా* 

*దుర్గ్రాహ్యహృదయాస్సదా I* 

*యువత్యః పాపసంకల్పాః* 

*క్షణమాత్రాద్విరాగిణః ৷৷* 

                *అయోధ్య 38/22*  


    దుష్టాలోచనలుగల యువతులు సర్వదా కపట వచనములను పలుకుతూ ఉంటారు. 

    కోపతాపాది వికారములకు లోనగుతూ ఉంటారు. 

    వారి మనస్సులలోగల భావాలు దుర్గ్రాహ్యాలు. 

    వారు చిన్నచిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి, వారికి దూరమవుతూ ఉంటారు.  


    Evil-minded young ladies are infidels. 

    They are of perverted nature. 

    They are inscrutable. 

    In an instant they lose their love (for their husbands). 


*న కులం న కృతం విద్యాం* 

*న దత్తం నాపి సంగ్రహమ్ I*

*స్త్రీణాం గృహ్ణాతి హృదయమ్* 

*అనిత్యహృదయా హి తాః ৷৷* 

                       *38/23* 

అట్టి స్త్రీలకు 

  - భర్తయొక్క అభిజాత్యము (గొప్ప వంశమున జన్మించడం) గానీ, 

  - అతడు చేసిన ఉపకారాలుగానీ, 

  - అతనియొక్క విద్యావైభవములుగానీ, 

  - అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులుగానీ, 

  - ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగానీ జ్ఞాపకమునకే ఉండవు. 

    ఎందుకంటే వారి స్వభావములు చంచలములు. వారికి పతికంటే సంపదలే ముఖ్యము. 

    అంతేకాదు "స్థూణానిఖనన" న్యాయమున వారు పాతవిషయమలను త్రవ్వుతూ భర్తతో ఎల్లప్పుడును గిల్లికజ్జాలాడుతూ ఉంటారు.  


    Neither family traditions 

    nor benefits received, 

    nor education 

    nor affection 

    nor gifts 

    nor even accumulated wealth attract women's hearts. 

    Their minds are unstable indeed. 


*సాధ్వీనాం హి స్థితానాం* 

*తు శీలే సత్యే శ్రుతే శమే I* 

*స్త్రీణాం పవిత్రం పరమం* 

*పతిరేకో విశిష్యతే ৷৷* 

                  *38/24* 


    సాధ్వీమణులరీతి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. 

    వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు. 

    గురువుల (పెద్దల) ఉపదేశాలను అనుసరించి నడుచుకొంటారు. 

    శాంత స్వభావం కలిగియుంటారు. 

    వారికి పతియే దైవము. వారి జీవితాలు పరమ పవిత్రాలు. 


    But for those virtuous women whose minds are fixed in 

  - chastity, 

  - truth, 

  - scriptures and 

  - stability, 

    the husband occupies a distinguished place and is considered supremely holy. 


*స్థూణానిఖననన్యాయము*  


    గుంజని పాతేటప్పుడు చాలాసార్లు నేలని తవ్వుతూ, గుంజని(స్తంభాన్ని) అటూఇటూ కదులుస్తూంటారు. 

    పోట్లాడే స్వభావంగలవారు తాము మాట్లాడుచున్న విషయానికి సంబంధంలేకుండా పాతవిషయాలను పదేపదే త్రవ్వుతూ ఎదుటివారిని నొప్పిస్తూంటారు. 

    ఎంతకీ వారు తమ మొండివాదాన్ని వీడరు. ఇది దుష్టుల లక్షణం. 

    దీనినే "స్థూణానిఖనన న్యాయం" అంటారు. 

    

                              =x=x=x= 


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

కామెంట్‌లు లేవు: